అంతా ఓకే అయ్యి.. పోస్టర్ కూడా రిలీజ్ అయిన తర్వాత ఆగిపోయిన బాలయ్య సినిమా ఏదో తెలుసా..?

frame అంతా ఓకే అయ్యి.. పోస్టర్ కూడా రిలీజ్ అయిన తర్వాత ఆగిపోయిన బాలయ్య సినిమా ఏదో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
కొంత మంది హీరోల కెరియర్లో ఓ సినిమా ఆల్మోస్ట్ ఓకే అయ్యి పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యి పోస్టర్లు కూడా విడుదల చేసిన తర్వాత ఆగిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా నందమూరి నటసింహం బాలకృష్ణ కెరియర్ లో కూడా ఓ సినిమాకు జరిగింది. ఆ సినిమా ఏది ..? ఎందుకు మొదలు పెట్టాక ఆ మూవీ ని ఆపేసారు అనే వివరాలను తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం బాలకృష్ణ హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ బ్యానర్లో హర హర మహాదేవ అనే టైటిల్ తో ఓ సినిమా లాంచింగ్ అయింది.

కానీ ఆ తర్వాత ఆ సినిమా ఆగిపోయింది. అసలు ఆ సినిమా ఆగిపోవడానికి గల కారణాలను ఓ ఇంటర్వ్యూలో భాగంగా స్ సినిమా దర్శకుడు అయినటువంటి బి గోపాల్ తెలియజేశాడు. బి గోపాల్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... బాలకృష్ణ హీరోగా బెల్లంకొండ సురేష్ బ్యానర్లో హర హర మహాదేవ అనే పేరుతో ఓ సినిమాలు స్టార్ట్ చేశాం. ఇకపోతే ఆ సినిమాను స్టార్ట్ చేసే సమయానికి మా దగ్గర కథ లేదు. సురేష్ ఒక రోజు బాలకృష్ణ తో సినిమా చేద్దాం అన్నాడు. ఓకే అన్నాను. మరి కథ లేదు కదా అంటే ఒక దర్శకుడి దగ్గర కథ ఉంది.

అది బాగుంది , దానిని వినిపిస్తాను అన్నాడు. ఓకే అని చెప్పి మూవీ ని లాంచ్ చేసాం. కానీ ఆ తర్వాత ఆ దర్శకుడు కథను వినిపించలేదు. ఆ సమయంలో చిన్ని కృష్ణ దగ్గర ఒక కథ ఉంది అంటే దానిని కూడా విన్నాను. కానీ అది పెద్దగా నచ్చలేదు. దానితో కథ సెట్ కాక ఆ మూవీ ని పక్కన పెట్టాల్సి వచ్చింది అని బి గోపాల్ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే బాలయ్య , బి గోపాల్ కాంబోలో అనేక సినిమాలు వచ్చాయి. వీరి కాంబోలో వచ్చిన చాలా మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: