ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో లవర్ బాయ్ అంటే వరుణ్ సందేశ్, తరుణ్, సిద్ధార్థ్ వంటి హీరోల పేర్లు గుర్తుకు వచ్చేవి. అయితే అలాంటి ఈ హీరోలు తమ సొంత తప్పిదాల కారణంగానే ఇండస్ట్రీలో అవకాశాలను కోల్పోయారు.ఇక వీరిలో ఒకరు సిద్ధార్థ్..ఈయన సినిమాల కంటే ఎక్కువగా ఎఫైర్స్ ద్వారానే మీడియాలో హైలెట్గా నిలిచారు.చాలామంది అమ్మాయిలతో ఈయన డేటింగ్ చేయడంతో మీడియాలో ఈయనపై ఎన్నో కాంట్రవర్సీలు నెలకొన్నాయి. అయితే అలాంటి సిద్ధార్థ్ తాజాగా అదితి రావు హైదరీని వనపర్తి లోని శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. అయితే సిద్ధార్థ్ అదితి పెళ్లి కావడంతో సిద్ధార్థ్ కు సంబంధించిన కొన్ని విషయాలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఇక సిద్ధార్థ్ అదితి రావు హైదరి కంటే ముందు ఎంతమంది అమ్మాయిలతో డేటింగ్ చేశారో ఇప్పుడు చూద్దాం..
నటుడు సిద్ధార్థ్ 2003లో మేఘనని పెళ్లి చేసుకొని పెళ్లి అయినా నాలుగు సంవత్సరాలకే విడాకులు తీసుకున్నారు. అయితే మేఘనని పెళ్లి చేసుకున్నా కూడా సిద్ధార్థ్ తన లవర్ బాయ్ వేషాలను మానుకోలేదట.దాంతో మేఘనకు విసుగు పుట్టి 2007లో విడాకులు తీసుకుంది. ఇక మేఘన తో పెళ్లయ్యాక కూడా హీరోయిన్ సోహా అలీ ఖాన్ తో డేటింగ్ చేయడంతో ఈ విషయం తెలిసి మేఘన గొడవ చేసిందట. అయినా కానీ తన రిలేషన్ వదులుకోలేదు. చివరికి భార్యతో విడాకులు అయ్యాయి. ఇక వీళ్లే కాకుండా జబర్దస్త్ సినిమాలో నటించే సమయంలో సమంతతో డేటింగ్ వార్తలు వినిపించాయి. అంతే కాదు వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారని, కానీ ఓ దోషం ఉండడంతో శ్రీకాళహస్తికి వెళ్లి రహస్యంగా పూజలు చేశారని కూడా కొన్ని ఫోటోలు చక్కర్లు కొట్టాయి.
కానీ వీరి మధ్య కూడా బ్రేకప్ జరిగింది. ఆ తర్వాత ఓ మై ఫ్రెండ్ సినిమాలో నటించిన శృతిహాసన్ తో కూడా సిద్ధార్థ్ ఎఫైర్ పెట్టుకున్నట్టు టాక్ వినిపించింది. ఇక మరో నటి దీపా సన్నిధితో కూడా సిద్ధార్థ్ డేటింగ్ చేస్తున్నారనే వార్త మీడియాలో వినిపించినప్పటికీ ఈ వార్తను దీపా సన్నిధి కొట్టి పారేసింది.ఇక బ్రేకప్స్ తో విసిగిపోయిన సిద్ధార్థ్ పర్మినెంట్ గా ఉండే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నారో ఏమో తెలియదు కానీ మహాసముద్రం సినిమా టైంలో అదితి తో ప్రేమలో పడి చివరికి ఆ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకొని తాజాగా వైవాహిక బంధం లోకి అడుగుపెట్టారు