21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్ ఒకరు నేషనల్ అవార్డ్ విన్నర్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదు ఇచ్చారు. చెన్నై, ముంబయి.. హైదరాబాద్ లతో సహా వివిధ నగరాల్లో అవుట్ డోర్ షూటింగ్ లకు వెళుతున్న వేళలోనూ.. హైదరాబాద్ లోని తన నివాసమైన నార్సింగ్ లోనూ తనపై అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా పేర్కొన్నారు. నిజానికి రెండు రోజుల క్రితమే బాధితురాలు ఫిర్యాదు ఇచ్చింది. ఆలస్యంగా బయటకు వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా జానీ మాస్టర్ మీద అత్యాచారం.. బెదిరింపులకు పాల్పడటం.. గాయపర్చటం తదితర ఆరోపణలతో కేసు నమోదు చేశారు. ఆ ఘటన తర్వాత విషయాన్ని
బయటికి ఎవరికీ చెప్పొద్దూ అంటూ బెదిరించారని, పలుమార్లు షూటింగ్ సమయంలో జానీ మాస్టర్ చెప్పినట్లు వినకపోతే అసభ్యంగా ప్రవర్తించేవాడు అని, మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం కూడా చేసాడని జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసింది. గతంలోనూ పలు వివాదాల్లో నేషనల్ అవార్డ్ విన్నర్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పేరు తెర మీదకు వచ్చింది. 2015లో ఒక కాలేజీలో మహిళపై దాడి కేసులో జైలుశిక్షను కోర్టు విధించింది. ఈ ఉదంతంపై జానీ మాస్టర్ స్పందించాల్సి ఉంది. అయితే ఈ విషయం తెలిసిన జానీ మాస్టర్ పరారీలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఫిర్యాదు చేసిన మహిళను సైతం పోలీసులు రహస్య
ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుపై జానీ మాస్టర్ ఇంకా స్పందించకపోవటం గమనార్హం. అయితే నేషనల్ అవార్డ్ విన్నర్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.. ఆయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు,తమిళ, కన్నడ ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ గా రాణిస్తున్నారు. తన కెరీర్ లో టాప్ స్పీడ్ తో దూసుకెళ్తున్న జానీ మాస్టర్‌కు బ్రేకులు పడ్డాయి అని చెప్పొచ్చు.