వామ్మో: జానీ మాస్టర్ మామూలోడు కాదుగా.. విస్తుపోయె నిజాలు..!

Divya
నిన్నటి రోజు నుంచి మీడియాలో కేవలం ఒకే ఒక న్యూస్ వైరల్ గా మారుతున్నది.. అదేమిటంటే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ రేప్ కేసు వ్యవహారమే.. జానీ మాస్టర్ తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ వంటి భాషలలో కూడా ఎన్నో సూపర్ హిట్ సాంగ్ కి కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. ఇటీవల తమిళంలో ఒక పాటకు కూడా ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు కూడా అందుకోవడం జరిగింది. అయితే ఇలా అవార్డు తీసుకోకముందే జానీ మాస్టర్ పైన లైంగిక వేధింపుల కేసు సంచలనంగా మారింది.

జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఒక యువతి పోలీసులకు సైతం ఫిర్యాదు చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆమె వయసు 21 సంవత్సరాలని ఈమె మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందిన యువతి అయినప్పటికీ ఢీ షోలో సెలెక్ట్ కావడం చేత హైదరాబాద్ కి చేరిందట. అలా 2017 లో జానీ మాస్టర్ తో పరిచయం ఏర్పడిందని.. ఆ తర్వాత కొద్ది రోజులకి తనని అసిస్టెంట్ గా జానీ మాస్టర్ తీసుకునేందుకు చాలా ప్రయత్నించారని.. రెండేళ్ల తర్వాత ఆమెను జానీ మాస్టర్ టీమ్ లో జాయిన్ అయ్యాను అని తెలిపింది.

జాయిన్ అయిన తర్వాత ఒకసారి ముంబైకి తీసుకువెళ్లారట... అప్పుడు జానీ మాస్టర్ తో పాటుగా మరొక ఇద్దరు అసిస్టెంట్లు కూడా ఉన్నారని వెల్లడించింది. ఆయువతి తల్లికి టికెట్ తీసుకోకపోవడం వల్ల ఆమె రాలేదని.. ముంబై హోటల్లో రూమ్లో తన పైన అత్యాచారం ప్రయత్నం చేశారని ఫిర్యాదు కూడ చేసింది. ఈ విషయం బయట చెబితే తనను ఉద్యోగం నుంచి తీసేస్తానంటూ. అలాగే తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలే రాకుండా చేస్తానంటూ బెదిరించారట. హైదరాబాద్ కు వచ్చిన కూడ ఇవేదింపులు ఇంకా కొనసాగించే వారిని తెలిపింది..

కారెవాన్ లలో కూడా ప్యాంటు తీసి పశువుల ప్రవర్తించే వారంటూ తన మాట వినలేదని ఒకసారి బలంగా అద్దానికేసీ కొట్టాడని .. చాలా ఇబ్బంది పెట్టారంటూ ఆ యువతి చెప్పుకొచ్చింది. కొన్నిసార్లు అందరం ముందు అసభ్యకరంగా ముట్టుకునే వాడని.. ఒకరోజు గుడి నుంచి వస్తూ ఉంటే ఒక గుర్తు తెలియని వ్యక్తితో బెదిరించి ఇంటి వద్ద పార్సల్ పెట్టి వార్నింగ్ ఇచ్చారంటూ తెలిపింది. ఇవే కాకుండా ఎన్నో చిత్రహింసలు పెట్టారంటూ ఆ యువతి పోలీసులకు తెలియజేసింది. ఈ విషయాలను జానీ మాస్టర్ ఖండించలేదు. ప్రస్తుతం ఆయన మొబైల్ స్విచ్ ఆఫ్ లో ఉన్నట్లు సమాచారం. ఆ యువతి చెప్పిన విషయాలు విన్న తర్వాత జానీ మాస్టర్ ని చాలామంది అసహ్యించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: