ప్రేక్షకులలో సత్య మ్యానియా !

frame ప్రేక్షకులలో సత్య మ్యానియా !

Seetha Sailaja
ఒకప్పుడు బ్రహ్మానందం ధర్మవరపు సుబ్రమణ్యం ఎమ్ ఎస్ నారాయణ అలీ వేణు మాధవ్ ల కామెడీ ట్రాక్ తో సినిమా ధియేటర్లలోని ప్రేక్షకులు విపరీత్యంగా నవ్వుకునేవారు. అయితే ఈమధ్య కాలంలో వీరి కామెడీ ట్రాక్ సీన్స్ ను పెద్దగా ప్రేక్షకులు ఎంజాయ్ చేయడంలేదు. అప్పుడప్పుడు వెన్నెల కిషోర్ కామెడీ సీన్స్ కు ప్రేక్షకులు ఎంజాయ్ చేసినప్పటికీ కేవలం అతడి కామెడీ కోసమే సినిమాలకు వెళ్ళే ప్రేక్షకులు ఉండటం లేదు.

లేటెస్ట్ గా విడుదలైన ‘మత్తు వదలరా’ పార్ట్ 2 మూవీని చూసిన ప్రేక్షకులు అంతా ఆమూవీలో నటించిన కీరవాణి కొడుకు శ్రీసింహ గురించి కంటే ఆమూవీలో మరొక హీరోగా నటించిన సత్య గురించి మాత్రమే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. వాస్తవానికి ఈమూవీ కథలో ఇద్దరి హీరోలకు సమాన పాత్ర ఉన్నప్పటికీ తన కామెడీ టైమింగ్ తో సత్య శ్రీసింహ ను డామినేట్ చేశాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి.  

ముఖ్యంగా ఈమూవీ ఫస్ట్ హాఫ్ లో ప్రేక్షకులను విపరీతంగా నవ్వించిన సత్య కామెడీ పంచ్ లతో ప్రేక్షకులు ఈమూవీని తెగ ఎంజాయ్ చేస్తూ ఉండటంతో ఈమూవీ కలక్షన్స్ ఆశించిన దానికన్నా చాల ఎక్కువ కనిపిస్తున్నాయి. వాస్తవానికి సత్య ‘మత్తువదలరా 1’ లో తన టాలెంట్ చూపించినప్పటికీ లేటెస్ట్ మూవీలో వచ్చినంత పేరు సత్యకు ‘మత్తువదలరా 1’ ఇవ్వలేకపోయింది.

గతంలో సత్య మంచి కమెడియన్ అని రుజువు చేసే పాత్రల్లో గతంలో చాలసార్లు నటించినప్పటికీ ఈసినిమాకు వచ్చినంత పేరు గతంలో సత్యకు ఎప్పుడు రాలేదు. ఈమధ్యనే విడుదలైన డిజాస్టర్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ లో కూడ సత్య పాత్రకు మంచి పేరు వచ్చింది పరిస్థితులు గమనిస్తూ ఉంటే రానున్న కాలంలో మంచి కమెడియన్ గా సత్య ఇండస్ట్రీలో సెటిల్ అయ్యే ఆస్కారం కనిపిస్తోంది అన్న మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టాప్ హీరోల సినిమాలలో కామెడీ పాత్రలకు వెన్నెల కిషోర్ చిరునామాగా కనిపిస్తున్న పరిస్థితులలో అతడికి సత్య నుండి గట్టి పోటీ ఎదురయ్యే ఆస్కారం కనిపిస్తోంది..    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: