చరణ్ ఫస్ట్ మూవీ కి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలుసా..?

frame చరణ్ ఫస్ట్ మూవీ కి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలుసా..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చరణ్ ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో హీరోగా నటించి అందులో చాలా మూవీ లతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకొని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. చరణ్ "చిరుత" అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయిన విషయం మన అందరికీ తెలిసిందే. నేహా శర్మ ఈ మూవీ లో హీరోయిన్గా నటించగా ... డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో అయిన మెగాస్టార్ చిరంజీవి కొడుకు కావడంతో చరణ్ నటించిన మొదటి మూవీ పై ఆ సమయంలో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన చిరుత మూవీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. చరణ్ ఈ మూవీ లో తన నటనతో , డాన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేశాడు. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఇది ఇలా ఉంటే చరణ్ ఈ సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలుసా. ఈ మూవీ ని చేసింది అశ్విని దత్ ఈయన చిరంజీవికి మంచి స్నేహితులు. ఇక సినిమా మొదలు పెట్టేముందు రెమ్యూనరేషన్ గురించి పెద్దగా ఏమీ మాట్లాడుకోలేదట. ఇక సినిమా స్టార్ట్ కావడం , రిలీజ్ కావడం , మంచి విజయం సాధించడం జరిగిందట. దానితో అశ్విని దత్ ఎంత రెమ్యూనరేషన్ ఇవ్వమంటావు అని చరణ్ ను అడిగితే చరణ్ మాత్రం ఏమీ చెప్పకుండా ఉన్నాడట. దానితో అశ్విని దత్ తనకు తోచినంత ఇచ్చాడట.

అందులో భాగంగా చరణ్ కు చిరుత సినిమా విషయానికి గాను 50 లక్షల రెమ్యూనరేషన్ ను అశ్విని దత్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అలా చరణ్ తన మొదటి సినిమా అయినటువంటి చిరుత కి 50 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. చరణ్ తాజాగా గేమ్ చేంజర్ మూవీ లో హీరోగా నటించాడు. తన నెక్స్ట్ మూవీ ని బుచ్చిబాబు సనా దర్శకత్వంలో చేయబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: