ఇదేం ట్విస్టూ.. 'దేవర'లో తారక్ డబుల్ రోల్ కాదా?

praveen
ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా ఒకే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. అదే గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర మూవీ గురించి. ఈ సినిమా ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక ప్రేక్షకులు అందరూ కూడా ఈ సినిమా విడుదల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను పలకరించబోతుంది అని చెప్పాలి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఏ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ నటించింది. ఇక ఈ సినిమాలో ఏకంగా విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నాడు అన్నది తెలుస్తుంది.

 అయితే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ద్విపత్రాభినయం చేయబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ద్వారా ఈ విషయంపై క్లారిటీ వచ్చింది అన్న విషయం తెలిసిందే. సాధారణంగా ఒక్క క్యారెక్టర్ ఉంటేనే జూనియర్ ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపిస్తాడు. అలాంటిది ద్విపాత్రాభినయం కావడంతో ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు. ఇలాంటి సమయంలో దేవర మూవీకి సంబంధించి ఒక కిక్ ఇచ్చే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. దేవర మూవీలో జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయడం లేదట..

 ఇదెక్కడి ట్విస్ట్ ద్విపాత్రాభినయం చేయలేదు అంటే కేవలం ఒకే పాత్ర కనిపించబోతున్నాడా అని అనుకుంటున్నారు కదా. అలా అనుకున్నారు అంటే మీరు పొరపాటు పడినట్లే. ఎందుకంటే ద్విపాత్రాభినయం కాదు ఏకంగా త్రిపాత్రాభినయం చేయబోతున్నాడట. మూడు పాత్రల్లో ప్రేక్షకులను అలరించబోతున్నాడట. ఈ విషయం తెల్సి ఫ్యాన్స్ మరింత ఖుషి అవుతున్నారు. త్రిపాత్రాబినయం అంటే అది బాక్స్ ఆఫీస్ ప్రభంజనమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: