చెన్నై కి షిఫ్ట్ కానున్న దేవర.. అక్కడ కూడా పెద్ద ప్లాన్..?

frame చెన్నై కి షిఫ్ట్ కానున్న దేవర.. అక్కడ కూడా పెద్ద ప్లాన్..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను మొత్తం రెండు భాగాలుగా విడుదల చేయనుండగా అందులో మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని జాన్వి కపూర్ , ఎన్టీఆర్ కు జోడిగా నటించగా ... సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఇస్ మూవీ కి సంగీతం అందించాడు.

ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా బృందం వారు ఈ మూవీ కి సంబంధించిన ప్రచారాలను మొదలు పెట్టారు. ఎక్కువ శాతం ఈ మూవీ యూనిట్ హిందీ పై ఫోకస్ పెట్టింది. హిందీ లో ఇప్పటికే చాలా ప్రచారాలను కూడా ఈ మూవీ బృందం చేసింది. ఇక ఆ తర్వాత ఈ మూవీ బృందం విశ్వక్ సేన్ , సిద్దు జొన్నలగడ్డ లతో ఓ ఇంటర్వ్యూను కూడా నిర్వహించింది. దీనిని మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు. ఈ మూవీ యూనిట్ తన నెక్స్ట్ ఫోకస్ ను తమిళ నాడు పై పెట్టినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా బుధవారం నుండి చెన్నై లో ప్రమోషన్స్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ రెండు , మూడు రోజుల పాటు ప్రమోషన్స్ నిర్వహించనున్నట్లు , అనేక ఇంటర్వ్యూలను అటెండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలా తమిళ నాడు లో కూడా ఈ మూవీ బృందం పెద్ద ఎత్తున ప్రచారాలను చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: