వృద్ధ హీరోలపాలిట వరంగా మారిన హీరోయిన్లు!

Suma Kallamadi
ఒకప్పుడు మన తెలుగులో బడా హీరోలుగా చలామణీ అయినవారు ఇపుడు దాదాపుగా వృద్ధాప్య దశకు చేరుకున్నారు. మెగాస్టార్ నుండి కింగ్ నాగార్జున వరకు ఓ నలుగురు ఐదుగురు హీరోల పరిస్థితి ఇపుడు అంతే. వారి క్రేజ్ నేటికీ తగ్గనప్పటికీ హీరోయిన్ల విషయంలో కొన్ని ఇబ్బందులు వారికి తలెత్తుతున్నాయి. ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమలో కెరీర్ మొదలు పెట్టిన వర్ధమాన నటీమణులు వారి పక్కన చేయలేమని తెగేసి చెబుతున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి వంటివారు పద్ధతిగా సీనియర్ హీరోయిన్ల వైపే మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది. ఎందుకనే కుర్ర హీరోయిన్ల దగ్గర వారి ఏజ్ కొట్టొచ్చినట్టు కనబడుతుందని వారికి బాగా తెలుసు.
ఇక అలాంటి వారిపట్ల కొంతమంది సీనియర్ హీరోయిన్లు వరంలా మారారనే చెప్పుకోవాలి. ఇక స్టార్ స్టేట‌స్ కు ఎదిగిన హీరోయిన్లు మనదగ్గర పదుల సంఖ్యల్లో సినిమాల్లో నటించినవారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో నయనతార, శ్రేయ, త్రిష, అనుష్క, ఐశ్వర్య రాయ్, స్నేహ తదితర హీరోయిన్లు ఎందరో ఉన్నారు. ఇపుడు ఇలాంటివాళ్లే మన సీనియర్ హీరోల పట్ల మొదటి ఆప్షన్ గా మారారు. దాంతో మన సీనియర్ హీరోల తాజా సినిమాలలో వీరినే హీరోయిన్లుగా ఎంచుకుంటున్న పరిస్థితి ఉంది.
హిందీ చిత్ర పరిశ్రమలో కొంత బెట‌ర్ కానీ, మనదగ్గర స్టార్ హీరోయిన్ నిర్వ‌చ‌న‌మే మారిపోయింది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎంత‌టి స్టార్ హీరోయిన్ అయినా కూడా నాలుగైదేళ్ల‌లో వీలైన‌న్ని అవ‌కాశాల‌ను అందిపుచ్చుకొని తరువాత కనుమరుగైపోతుంటారు. ఎందుకంటే ఇక్కడ కొత్తవాళ్ళకి అవకాశాలు పుష్కలంగా వస్తాయి. పైగా ఇక్కడ జనాలు కూడా పాత ముఖాలను పదేపదే చూడడానికి ఇష్టపడరు. అయితే హీరోల పరిస్థితి అలా కాదు. ముఖ్యంగా స్టార్ హీరోలు. ఒక్కసారి ఒక హీరో ఇక్కడ స్టార్ అయ్యి కూర్చున్నాడు అంటే వాడు చచ్చేవరకు స్టార్ గానే చచ్చిపోతాడు. కానీ హీరోయిన్ల సంగతి అలా కాదు. కానీ రానురాను పరిస్థితి ఇక్కడ కూడా హీరోయిన్ల విషయంలో మారుతుంది అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా చలామణీ అయినవారు ఇపుడు అడపాదడపా సీనియర్ హీరోల సినిమాలలో వేషాలు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: