తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత స్పీడ్ గా సినిమాలను తెరకెక్కించే దర్శకులలో
అనిల్ రావిపూడి ఒకరు. ఈయన ఎంత స్పీడ్ గా సినిమాలను రూపొందించిన ఫుల్ క్వాలిటీ గా సినిమాలను కూడా తెరకెక్కిస్తూ ఉంటాడు. ఈయన
పటాస్ సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ఈయన చాలా సినిమాలకు దర్శకత్వం వహించగా ఇప్పటివరకు
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఏ
సినిమా కూడా
బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం అందుకోలేదు. దానితో ఈయన తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా
అనిల్ కి మంచి గుర్తింపు ఉంది.
ఇకపోతే
అనిల్ రావిపూడి కొన్ని రోజుల క్రితమే
వెంకటేష్ హీరోగా
ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి
చౌదరి హీరోయిన్లుగా ఓ సినిమాను మొదలు పెట్టాడు. ఈ సినిమాను ఈ వచ్చే సంవత్సరం
సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ
మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. దానితో ఈ
సినిమా సంక్రాంతి కి విడుదల అవుతుందా అని అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి.
కానీ
అనిల్ రావిపూడి ఇది వరకు చాలా సినిమాలను అత్యంత స్పీడ్ గా పూర్తి చేసిన సందర్భాలు ఉండడంతో ఈయన ఈ సినిమాను కూడా
సంక్రాంతి కి తీసుకువస్తాడు అని చాలా మంది భావించారు.
అనుకున్నట్లుగానే ఈయన
సంక్రాంతి కి చాలా ముందుగానే ఈ సినిమాకు సంబంధించిన పనులను పూర్తి చేసే విధంగా కనిపిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ
సినిమా షూటింగ్ మొదలు అయిన ఇప్పటికే 50 శాతం కి పైగా ఈ
సినిమా షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది.
నవంబర్ నెల చివరి వరకు ఈ సినిమాకు సంబంధించిన మొత్తం షూటింగ్ పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది.