ఆ సూపర్ హిట్ మూవీ కి పార్ట్ 4... విలన్ గా సూర్య..!

lakhmi saranya
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా చాలా సినిమాల్లో నటించాడు. మంచి హీరోగా పేరు సంపాదించుకున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రజెంట్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. త్వరలో 'కంగువ' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఈ హీరో..
 అప్పుడే తన తదుపరి ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టేసాడు. 'Suriya 44 ' అనే వర్కింగ్ టైటిల్ తో తర్కెక్కుతున్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బారాజు దర్శకత్వం వహిస్తుండగా... పూజ హెగ్డే ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే... ఇప్పుడు సూర్య బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైనట్లు తెలుస్తుంది. అయితే..హీరోగా అనుకుంటే అది మీ పొరపాటే. హీరోగా కాకుండా విలన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నడట సూర్య. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజి 'ధూమ్' చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఈ ఫ్రాంచైజి చిత్రం మూడు సినిమాలు రాగా..
అన్ని బ్లాక్ బస్టర్ చిట్ను సొంతం చేసుకున్నాయి. ఈ 'ధూమ్-4 ' తెరకెక్కతున్నట్లు తెలుస్తోంది. అయితే... ఫస్ట్ పార్ట్ లో జాన్ అబ్రహం విలన్ గా సెకండ్ పార్ట్ లో హృతిక్ రోషన్, థర్డ్ పార్ట్ లో అమీర్ ఖాన్ నటించగా... మూడు పార్ట్స కూడా సూపర్ డూపర్ హిట్ అందుకుని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించాయి. ఇప్పుడు 'ధూమ్ 4' వెరకెక్కించేందుకు సన్నాహలు సిద్ధం చేస్తుండగా... పార్ట్ 4లో విలన్ గా సూర్య నటించబోతున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే అటు తమిళ ఫ్యాన్స్ తో పాటు ఇటు తెలుగు ఫ్యాన్స్‌కు కూడా పండగా అనే చెప్పుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: