ఒక్క దెబ్బతో విజయ్ ను వెనక్కు నెట్టేసిన ప్రభాస్..?

frame ఒక్క దెబ్బతో విజయ్ ను వెనక్కు నెట్టేసిన ప్రభాస్..?

MADDIBOINA AJAY KUMAR
కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో తలపతి విజయ్ ఒకరు. ఈయన కొంత కాలం క్రితమే గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అనే సినిమాలో హీరో గా నటించాడు. త్రిష ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా , వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సెప్టెంబర్ 5 వ తేదీన విడుదల అయ్యి ప్రస్తుతం విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. ఈ సినిమా కోసం విజయ్ 200 కోట్ల పారితోషకాన్ని తీసుకున్నాడు అని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇప్పటివరకు ఇండియన్ సినీ పరిశ్రమలో 200 కోట్ల రెమ్యూనరేషన్ ఏ హీరో తీసుకోలేదు అని , విజయ్ మాత్రమే అంత తీసుకున్నాడు అని , అతను ఇండియాలోనే అత్యంత ఎక్కువ పారితోషకం తీసుకున్న హీరోల లిస్టులో మొదటి స్థానంలో నిలిచాడు అని వార్తలు కూడా వచ్చాయి. ఇక టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ , విజయ్ 200 కోట్ల రెమ్యూనిరేషన్ ను దాటేసినట్లు తెలుస్తోంది. ప్రభాస్ మరికొన్ని రోజుల్లో హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ  అనే సినిమా చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కోసం ప్రభాస్ ఏకంగా 250 కోట్ల పారితోషకాన్ని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ఇలా గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) మూవీ తో 200 కోట్ల పారితోషకాన్ని విజయ్ తీసుకుంటే ప్రభాస్ "ఫౌజి" మూవీ కోసం ఏకంగా 250 కోట్ల పారితోషకాన్ని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రభాస్ ఇండియా లోనే అత్యంత భారీ పారితోషకం తీసుకున్న హీరోల లిస్టులో ప్రస్తుతానికి మొదటి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ కొన్ని రోజుల క్రితమే కల్కి 2898 AD అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: