మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఇంద్ర మూవీ ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు బి గోపాల్ దర్శకత్వం వహించాడు. మరి బి గోపాల్ , చిరంజీవి తో ఇంద్ర సినిమా చేయను అంటే పరిచూరు గోపాలకృష్ణ దగ్గరుండి ఆయనను కన్విన్స్ చేయించి ఈ సినిమా చేయించాడు. అసలు ఏం జరిగింది అనే వివరాలను తెలుసుకుందాం. ఓ ఇంటర్వ్యూలో భాగంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ... అశ్విని దత్ చిరంజీవి హీరోగా ఓ సినిమా చేయాలి అనుకున్నాడు.
ఆ మూవీ కి బి గోపాల్ ను దర్శకుడిగా ఎంచుకున్నాడు. చిన్నికృష్ణ దగ్గర ఒక కథ ఉంది. దానిని విని సినిమా చేయి అని అశ్విని దత్ , గోపాల్ కి చెప్పాడు. ఆ స్టోరీ మొత్తం విన్న తర్వాత గోపాల్ కి అది నచ్చలేదు. సినిమా చేయను అని అన్నాడు. ఇక నేను ఒక రోజు గోపాల్ ను కలిసాను. ఎందుకు నువ్వు ఆ సినిమా చేయను అన్నావు అని అడిగాను. దానికి ఆయన నేను ఇది వరకే రెండు ఫ్యాక్షన్ సినిమాలు చేసి ఉన్నాను. చిన్నికృష్ణ దగ్గర ఉన్న కథ కూడా ఫ్యాక్షన్ స్టోరీ నే.
మళ్లీ అలాంటి సినిమా నే తీస్తే జనాలు చూస్తారా లేదా అని అనుమానం ఉంది. నేను ఇప్పటికే చిరంజీవి తో మెకానిక్ అల్లుడు అనే సినిమాను చేశాను. అది ఫ్లాప్ అయ్యింది. మళ్లీ చిరంజీవి తో ప్లాప్ సినిమా తీయలేను. కచ్చితంగా బ్లాక్ బాస్టర్ సినిమానే చేస్తాను. అందుకే ఈ సినిమా చేయను అని అన్నాడు. దానితో నేను నువ్వు బాలకృష్ణ తో ఫ్యాక్షన్ సినిమాలు చేశావు. చిరంజీవి తో కాదు. చిరంజీవి తో ఈ కథతో సినిమా చెయ్యి వర్కౌట్ అవుతుంది అని చెప్పాను. దానితో కొంత సమయానికి గోపాల్ కన్విన్స్ అయ్యాడు. ఆ తర్వాత చిన్నికృష్ణ దగ్గర ఉన్న కథతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని చెప్పాడు. ఇలా పరుచూరి గోపాలకృష్ణ ఇన్వాల్వ్మెంట్ తో ఇంద్ర మూవీ వచ్చినట్లు తెలుస్తోంది.