NBK 109 : ఎందుకు ఈ కన్ఫ్యూజన్.. వెయిటింగ్.. టీం ప్రవర్తనతో సతమతమవుతున్న బాలయ్య ఫ్యాన్స్..?

frame NBK 109 : ఎందుకు ఈ కన్ఫ్యూజన్.. వెయిటింగ్.. టీం ప్రవర్తనతో సతమతమవుతున్న బాలయ్య ఫ్యాన్స్..?

MADDIBOINA AJAY KUMAR
నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ చాలా రోజుల క్రితమే ఓ మూవీ ని మొదలుక్పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఇప్పటివరకు ఈ సినిమాకు మూవీ బృందం టైటిల్ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ బాలయ్య కెరియర్ లో 109 వ రూపొందుతున్న నేపథ్యంలో ఈ సినిమా యొక్క చిత్రీకరణను NBK 109 అనే వర్కింగ్ టైటిల్తో మూవీ బృందం తెరకెక్కిస్తూ వస్తుంది.

ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన రెండు ప్రోమోలను ఈ మూవీ బృందం విడుదల చేసింది. కానీ ఈ సినిమా యొక్క టైటిల్ను ప్రకటించలేదు. ఈ మూవీ విడుదల తేదీలను కూడా అధికారికంగా అనౌన్స్ చేయలేదు. ఈ సినిమా ఆ తేదీన విడుదల కానుంది , ఈ తేదీన విడుదల కానుంది అని అనేక వార్తలు ఇప్పటివరకు వచ్చాయి. ప్రస్తుతం కొత్తగా ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇలా ఈ మూవీ బృందం ఇప్పటివరకు ఈ సినిమాకు టైటిల్ను కన్ఫర్మ్ చేయకపోవడం , విడుదల తేదీని అధికారికంగా ప్రకటించకపోవడంతో బాలయ్య అభిమానులు తొందరగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ మరియు విడుదల తేదీని ప్రకటిస్తే బాగుంటుంది అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

వరుస విజయాలతో ఫుల్ జోష్లో ఉన్న బాలయ్య హీరోగా నటిస్తున్న మూవీ కావడం , వాల్టేరు వీరయ్య లాంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత బాబీ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో ప్రస్తుతానికి భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ నుండి ఇప్పటివరకు ఈ చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలకు కూడా మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: