రిలీజ్ కి ముందే.. చరిత్ర సృష్టించిన దేవర?

frame రిలీజ్ కి ముందే.. చరిత్ర సృష్టించిన దేవర?

praveen
ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా కూడా ఒకే సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అదే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా గురించి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర మూవీ ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నాడు అని చెప్పాలి. దీంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక ఈ మూవీలో తారక్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది.

 ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ కి ఇదే మొదటి సినిమా కావడం గమనార్హం. కాగా ప్రస్తుతం విడుదలకు తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో  అటు చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది అని చెప్పాలి. దీంతో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు దేవరా మూవీకి సంబంధించిన ఇంటర్వ్యూ వీడియోలే దర్శనమిస్తూ ఉన్నాయి. కాగా ఈ మూవీలో ప్రేక్షకులు అందరూ కూడా ఆశ్చర్యపోయే ఒక పెద్ద సర్ప్రైజ్ కూడా ఉంది అని ఎన్టీఆర్ ఒక సీక్రెట్ రివ్యూ చేయడంతో అభిమానులు ఈ సర్ప్రైజ్ ఏంటా అని చూడటానికి మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 ఇకపోతే విడుదలకు సిద్ధమవుతున్న జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ ఇటీవల చరిత్ర సృష్టించింది. అమెరికా అడ్వాన్స్ ప్రీమియర్ టికెట్ సేల్స్ లో రికార్డు క్రియేట్ చేసింది. అత్యంత వేగంగా $ 1.75M సాధించిన తొలి భారతీయ చిత్రంగా నిలిచినట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. అలాగే 10 రోజుల్లోనే 40 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయినట్లు చెప్పుకొచ్చారు  కాక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ పాటలు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించాయి. అభిమానులు అందరిలో కూడా అంచనాలను రెట్టింపు చేశాయి  ఇక ఇప్పుడు ఈ మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూస్తూ ఉంటే దేవర బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమని తారక్ ఫ్యాన్స్ అందరూ కూడా బలంగా నమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: