ఎన్టీఆర్ తో ప్రేమాయణం.. ఆ హీరోయిన్ సినీ కెరీర్ నే నాశనం చేసిందా..?

murali krishna


* టాలీవుడ్ లో తిరుగులేని మాస్ హీరోగా ఎదిగిన ఎన్టీఆర్
* చిన్న వయసులోనే ఏ హీరోకి సాధ్యం కాని రికార్డ్స్ ఎన్టీఆర్ సొంతం.
* ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు..
* ఆ హీరోయిన్ తో ఎన్టీఆర్ ప్రేమాయణం అంటూ అప్పట్లో గుప్పుమన్న వార్తలు
* దీనితో ఆ హీరోయిన్ కెరీరే డేంజర్ లో పడిందిగా..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు మనవడిగా సినీ ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అద్భుతమైన నటనతో తాతను మించిన మనవడిగా గుర్తింపు తెచ్చుకుని ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.. బాల రామాయణం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయిన ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. ఆది, సింహాద్రి సినిమాలతో టాలీవుడ్ లో అతి చిన్న వయసులోనే తిరుగులేని మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.. మాస్ ప్రేక్షకులలో ఎన్టీఆర్ కు వున్న క్రేజే వేరు..చిన్న వయసులోనే ఇంతటి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ టాలీవుడ్ లో ఒక హీరోయిన్ తో ప్రేమలో పడ్డారనే వార్త అప్పట్లో తెగ వైరల్ అయింది..ఆ హీరోయిన్ ఎవరో కాదు క్యూట్ బ్యూటీ సమీరా రెడ్డి..

ఈ భామ ఎన్టీఆర్ సరసన మొదట 2006 లో వచ్చిన ‘అశోక్’ సినిమాలో హీరోయిన్ గా నటించింది..సమీరా రెడ్డి తెలుగులోనే కాకుండా హిందీ, మలయాళ, కన్నడ, బెంగాలీ, తమిళ సినిమాలలో ఎన్నో సినిమాలలో నటించింది.ఎన్టీఆర్ తో నటించిన అశోక్ సినిమా తరువాత వీరిద్దరి పెయిర్ గురించి తెగ రూమర్స్ వచ్చాయి..ఎన్టీఆర్, సమీరా ల మధ్య ప్రేమాయణం ఉందంటూ… వారిద్దరి మధ్య డేటింగ్ కూడా నడుస్తుందని అప్పట్లో వార్తలు తెగ వైరల్ అయ్యాయి..ఆ తరువాత నరసింహుడు సినిమాలో కూడా సమీరా రెడ్డి నటించడంతో ఆ రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి..మా ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమ కాదని, కేవలం స్నేహమని సమీరా రెడ్డి తెలిపారు.. ఇలాంటి రూమర్స్ వల్లే మా రెండు కుటుంబాలు చాలా డిస్టర్బ్ అయ్యాయి.. అందుకే తాను తెలుగు సినిమాలలో నటించడం మానేసినట్టు పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు...అలాగే ఎన్టీఆర్ కూడా సమీరా నాకు మంచి స్నేహితురాలని చెప్పుకొచ్చారు.. ఈ రూమర్స్ రావడం సహజమే నాకు వున్న ఏజ్ అలాంటిది అని ఎన్టీఆర్ తెలిపారు..ఆ తరువాత ఎన్టీఆర్ కొన్నాళ్లకు ఎన్టీఆర్ ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరి బంధువు కుమార్తె అయిన లక్ష్మి ప్రణతి తో ఎన్టీఆర్ కు వివాహం జరిగింది..  ఎన్టీఆర్, ప్రణతి కి ఇద్దరు కుమారులు.. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు…

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: