మంగళవారం -2 పై అప్డేట్.. పాయల్ ఈసారి ఏకంగా..?

Divya
Rx -100 చిత్రం తో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది హీరోయిన్ పాయల్ రాజు పుత్. ఇందులో హీరోగా కార్తికేయ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. డైరెక్టర్ అజయ్ భూపతి కూడా తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. అటు హీరో, హీరోయిన్ ,డైరెక్టర్ అందరికీ ఈ సినిమా మార్చేసింది. అయితే బోల్డ్ సన్నివేశాలతో రెచ్చిపోయిన నటించిన పాయల్ అనుకున్నంత స్థాయిలో మాత్రం సక్సెస్ కాలేక పోయింది. డైరెక్టర్ అజయ్ భూపతి కూడా మహాసముద్రం సినిమాని తీసిన పెద్దగా సక్సెస్ సాధించలేకపోయారు.

కానీ గత ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన మంగళవారం సినిమా అటు పాయల్ డైరెక్టర్ అజయ్ భూపతి కెరీర్ నే ఒక్కసారిగా మార్చేసింది. భారీ కలెక్షన్స్ రాబట్టడమే కాకుండా పాయల్ అద్భుతమైన నటనకి ప్రశంసలు కూడా అందుకుంది. గ్లామర్ తో పాటు యాక్టింగ్ తో కూడా అదరగొట్టేసిన మంగళవారం చిత్రానికి సీక్వెల్ రాబోతుందని చివరిలో చూపించారు. తాజాగా మంగళవారం-2 సినిమా తీయడానికి చిత్ర బృందం సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే డైరెక్టర్ అజయ్ భూపతి మంగళవారం-2 చిత్రం కోసం స్క్రిప్టు సిద్ధం చేస్తున్నారని ప్రస్తుతం చివరి దశలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా సీక్వెల్ కాదని ఫ్రీక్వెల్ అన్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి అనౌన్స్మెంట్ చేయబోతున్నారట. బడా బ్యానర్ పైన ఈ సినిమాని నిర్మిస్తున్నారట. అయితే ఈసారి పాయల్ పాత్ర మరింత డోస్ ఎక్కువగా ఉంటుందని.. మంగళవారం సినిమాని మించి పోయేలా కచ్చితంగా ఫ్రీక్వెల్ ఉంటుందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అనుకోని ట్విస్టులతో కూడా ఈ సినిమా ఉండబోతుందట. మంగళవారం -2 ప్రిక్వెల్ లో కూడా ఈసారి స్టార్ నటీనటులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఏది ఏమైనా ఈసారి ఎన్నడు చూడను పాయల్ ను చూస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: