'దేవర'తర్వాత కొరటాల నెక్స్ట్ మూవీ.. ఏ హీరోతో తెలుసా?

frame 'దేవర'తర్వాత కొరటాల నెక్స్ట్ మూవీ.. ఏ హీరోతో తెలుసా?

praveen
రైటర్ గా తన ప్రస్తానాన్ని ప్రారంభించిన కొరటాల శివ తర్వాత డైరెక్టర్గా అవతారం ఎత్తాడు. మిర్చి సినిమాతో డైరెక్టర్ గా మారి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత శ్రీమంతుడు, భరత్ అనే నేను,  జనతా గ్యారేజ్ లాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తీసి ఇక సూపర్హిట్లు అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో తీసిన ఆచార్య సినిమా మాత్రం మిస్ ఫైర్ అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఫ్లాప్ గానే మిగిలిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక ఆచార్య తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న కొరటాల శివ ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తో రెండోసారి సినిమా తీస్తున్నాడు.

 ఈ క్రమంలోనే దేవర అనే మూవీ ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది. ఇక ఈ మూవీలో తారక్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక భారీ తారాగణం కూడా కీలకపాత్రలో కనిపించబోతుంది. అయితే దేవరా లాంటి భారీ ప్రాజెక్టు తర్వాత కొరటాల నెక్స్ట్ సినిమా ఎవరితో చేయబోతున్నాడు అనే ఆసక్తి అందరిలో ఉండడం సహజం.

 ప్రస్తుతం సినీ సర్కిల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్లాల్ తో కొరటాల శివ నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడు అంటూ సమాచారం. ఇప్పటికే కథ చర్చలు కూడా జరిగాయట  ప్రణవ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో అటు మోహన్ లాల్ కూడా ఒక కీలకపాత్రలో కనిపించబోతున్నాడట. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్లో ఈ సినిమాను నిర్మించేందుకు సిద్ధమైంది అని తెలుస్తుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా మోహన్లాల్ తనయుడు ప్రణవ్  ఇప్పటివరకు హీరోగా పలు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన.. సరైన హిట్టు మాత్రం కొట్టలేకపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: