గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రెటీల ఎఫైర్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అటు రాజకీయాల్లోనే అనుకుంటే ఇటు సినిమాల్లో కూడా ఎన్నో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. అలా తాజాగా జానీ మాస్టర్ వ్యవహారం మీడియాలో ఎంత రచ్చ సృష్టిస్తుందో చెప్పనక్కర్లేదు.ఇదిలా ఉంటే ఈ మధ్యనే కోలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి జయం రవి తన భార్య ఆర్తి కి విడాకులు ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ విడాకుల విషయం తనకు తెలియదని విడాకుల గురించి భర్తతో చాలాసార్లు మాట్లాడాలని చూసినా కూడా టైం ఇవ్వలేదని,తనకు తెలియకుండానే విడాకులు ఇచ్చేసారు అంటూ ఆర్తి ఆవేదన వ్యక్తం చేసింది.అయితే ఆర్తికి విడాకులు ఇవ్వడం ఇష్టం లేకపోయినప్పటికీ జయం రవి బలవంతంగా విడాకులు ఇచ్చినట్టు ఆమె మాటలు వింటే అర్థమవుతుంది. అయితే జయం రవి విడాకులు ఇవ్వడానికి కారణం స్టార్ సింగర్ అని,ఆ స్టార్ సింగర్ తో గోవాలో సహజీవనం చేయడం వల్లే కట్టుకున్న భార్యకు జయం రవి అన్యాయం చేసి పిల్లల కోసం కూడా ఆలోచించకుండా విడాకులు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక జయం రవి ఎఫైర్ పెట్టుకున్నట్టు వార్తలు వస్తున్న ఆ సింగర్ ఎవరో కాదు కెనీషా..
అయితే ఈ విషయం బయటపడడానికి కారణం జూన్ 4 న జయం రవి ఆర్తిల పెళ్లి రోజు నాడు షూటింగ్ అని చెప్పి బయటకు వెళ్లారట.కానీ అదే రోజు ఆయన గోవాలో ఆర్తి పేరు మీద ఉన్న కారులో ఉన్నాడు. ఇక కారుపై నిషేధిత బ్లాక్ సన్ ఫిల్మ్ ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆ ఎస్ఎంఎస్ ఆర్తి ఫోన్ కి వచ్చింది. దాంతో షూటింగ్ అని చెప్పి అక్కడికి ఎందుకు వెళ్లారు అని ఆరాతీసి ఎవరెవరు ఉన్నారు అని అడగగా.. కెనీషా పేరు బయటపడింది. కానీ ఈ విషయంలో ఆర్తి సీరియస్ అవ్వడంతో కెనిషా మాత్రమే కాదు మరి కొంత మంది స్నేహితులు ఉన్నారు అని కవర్ చేశారట జయం రవి. ఆ తర్వాత అదే కారులో స్పీడ్ గా వెళ్తూ ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘించడంతో ఈ మెసేజ్ కూడా పోలీసులు ఆర్తి కార్ కాబట్టి ఆర్తి ఫోన్ కి మెసేజ్ వెళ్ళిందట.
దాంతో ఆ కారు నడిపింది ఎవరో ఆరా తీయగా కెనీషా పేరు బయటికి వచ్చిందట. దాంతో వీరిద్దరి మధ్య గొడవలు తీవ్రస్థాయికి చేరి చివరికి గోవా వెళ్లి అక్కడ జయం రవి చెప్పిన హోటల్ కి వెళ్లి అడగగా వాళ్ళు ఈ హోటల్లో లేరు అని హోటల్ సిబ్బంది చెప్పడంతో అసలు విషయం బయటపడింది. జయం రవి కెనీషాతో కలిసి ఒక పెద్ద బిల్డింగ్ ని గోవాలో కొనుగోలు చేసి అక్కడే సహజీవనం చేస్తున్నట్టు తెలుస్తోంది అయితే గత కొద్ది రోజులుగా జయం రవి గోవా వెళ్తూ వస్తున్నారట.అలా వీరి మధ్య విడాకులకు ఈ గొడవ దారి తీసినట్టు తెలుస్తుంది. ఇక ఆర్తితో కలిసి ఉండలేని జయం రవి ఆమెకు విడాకులు ఇచ్చి కెనీషాని రెండో పెళ్లి చేసుకోవాలని చూస్తున్నారని కోలీవుడ్లో కొన్ని వార్తలు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే కచ్చితంగా జయం రవి స్పందించాలి అంటున్నారు ఆయన ఫ్యాన్స్