'దేవర' ఆయుధ పూజ సాంగ్ పై క్రేజీ అప్డేట్. రిలీజ్ ఎప్పుడంటే..?

murali krishna
ప్రస్తుతం తెలుగు ఆడియెన్స్ బాగా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్న సినిమా దేవర. ఇది ఎన్టీఆర్‌ సోలో హీరోగా నటించిన మొదటి పాన్‌ ఇండియా మూవీ కావడం విశేషం. అంతేకాదు ఆరేళ్ల తర్వాత తారక్‌ నటించిన సోలో మూవీ కూడా ఇదే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ విలన్‌గా చేశాడు. ప్రకాష్‌ రాజ్‌, అజయ్‌ పాత్రలు కీలకంగా ఉండబోతన్నాయి. ఈ సినిమాలో తారక్‌ రెండు పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. తండ్రి పాత్ర దేవర, కొడుకు పాత్ర వర అని తెలుస్తుంది. ఫస్ట్ లుక్‌లు విడుదల చేసినప్పుడే ఆ డిఫరెంట్స్ ని పోస్టర్స్ లో వెల్లడించింది టీమ్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ గ్లోబల్ లెవల్ కు పెరిగింది.దే వర..దేవర..దేవర..ఇప్పుడు నెలరోజులుగా సోషల్ మీడియాను దున్నేస్తోన్న ఎన్టీఆర్ మేనియా ఇది. ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో వేగం పెంచారు.వరుస సాంగ్స్ అప్డేట్స్ తో ఆడియన్స్ కి బూస్ట్ ఇస్తున్నారు.దేవర నుండి ఇప్పటికే మూడు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసారు మేకర్స్.తాజాగా ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ అప్డేట్ హల్ చల్ చేస్తుంది.ఈ సినిమాలోని మోస్ట్ అవైటెడ్ నాలుగవ లిరికల్ సాంగ్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.తాజాగా 'దేవర' నుంచి ఫోర్త్ సింగిల్ ' ఆయుధపూజ' సాంగ్ రిలీజ్ ముహూర్తం ఖరారైంది. రేపు గురువారం (సెప్టెంబరు 19న) 11: 07 గంటలకు ఆయుధపూజ పాటను రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేసారు. "మీరు అడిగారు మరియు మేము వెనక్కి తగ్గలేకపోయాము.రేపు ఉదయం 11:07 నుండి ఆయుధపూజ సంగీత పిచ్చిగా మారుతుంది" అంటూ క్యాప్షన్ జోడించారు.అనిరుధ్ కంపోజ్ చేసిన ఈ పాటకు సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ఇప్పటికే ఈ పాట అప్డేట్ గురించి, ఎన్టీఆర్ శివ తాండవం గురించి పలుమార్లు సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులతో రామ జోగయ్య శాస్త్రి పంచుకున్నారు. ఇక ఈ క్రేజీ అప్డేట్తో బాక్సులు బ్లాస్ట్ అవ్వడం కన్ఫమ్ అనే టాక్ ఉంది. మరి ఏమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: