వామ్మో ఈమె ఆమే నా.. హుషారు సినిమాలో ఈ బ్యూటీ గుర్తుందా..!?

Anilkumar
హీరోయిన్ ప్రియా వడ్లమాని అంటే మనలో చాలా మందికి గుర్తు పట్టడం కష్టమే కానీ ‘హుషారు’లో లవర్ కి హ్యాండ్ ఇచ్చినఅమ్మాయి అనగానే టక్కున గుర్తుపట్టేస్తారు. నిజానికి అది ఆమె ఫస్ట్ సినిమా కాదు కానీ ఆ సినిమాతో మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంది. తెలుగమ్మాయి అయిన ప్రియ 2018లో ‘ప్రేమకు రెయిన్ చెక్’ అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తరువాత శరత్ నర్వాడే డైరెక్షన్లో ‘శుభలేఖలు’ అని మరో సినిమా కూడా చేసింది కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. ఇక ఆ తరువాత చేసిన ‘హుషారు’ సినిమా ఆమెకు కొంత గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో ‘అందం అమ్మాయైతే

 నీలా ఉందే’ పాట ఈమె కోసమే రాశారా అన్నట్టు ఒక రేంజ్ గుర్తింపు ఆమెకు లభించింది. హుషారు’ తర్వాత ఆవిరి, కాలేజ్ కుమార్ అని మరో రెండు సినిమాలు కూడా చేసింది కానీ అవి కూడా వర్కౌట్ అవలేదు. గతేడాది చివర్లో కలర్ ఫోటో దర్శకుడి ‘ముఖచిత్రం’ సినిమాలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న రెండు పాత్రల్లో నటించి అందరినీ మెప్పించింది ప్రియా వడ్లమాని.  అయితే హుషారు తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా  తర్వాత ఈ చిన్నది చాలా మంది ఫెవరెట్ హీరోయిన్ అయ్యింది కానీ ఎక్కువ సినిమా లతో బిజీ కాలేకపోయింది. హుషారు ఒకటి రెండు ల్లో చేసింది కానీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.

చివరిగా ఓం భీమ్ బుష్ లో ఓ సాంగ్ లో కనిపించింది ప్రియా. హుషారు తర్వాత ఆవిరి, కాలేజ్ కుమార్, ముఖచిత్రం, మను చరిత్ర సినిమా ల్లో కనిపించింది. ప్రస్తుతం బ్రహ్మానందం అనే సినిమా లో నటిస్తుంది. కాగా సోషల్ మీడియాలో ప్రియా చాలా యాక్టివ్ గా ఉంటుంది. నెట్టింట ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి... అలా ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఉంది ఈ బ్యూటీ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: