మరో 10 రోజుల్లో ‘దేవర’ సందడి షురూ కానున్న విషయం తెలిసిందే. ‘అరవింద సమేత వీర రాఘవ’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఎన్టీఆర్ సోలోగా వస్తుండటంతో ఈ మూవీపై ఇటు టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా వైడ్‌గా భారీ అంచనాలు ఉన్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్ లతో పాటు శ్రీకాంత్ తదితరులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చానా పెద్ద కథ స్వామి రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ అంటూ ప్రకాష్ రాజ్ డైలాగ్స్ తో దేవర ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ‘దేవర కథ’ పై ఇప్పటికే ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. నిజానికి ట్రైలర్ చూస్తే.. కథ
ఏదో కొంచెం రివీల్ అయినట్టుగా అనిపించింది, ట్రైలర్ ను బట్టి సినిమాలో ఇద్దరు ఎన్టీఆర్ లు ఉన్నారు, డబుల్ యాక్షన్ హైలైట్ గా ఉంటుందని క్లారిటీ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ రిలీజ్ కు భారీ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తెలంగాణలో 1 గంట షోలు ప్లాన్ చేస్తున్నారు. ఈ షోలు సింగిల్ స్క్రీన్స్‌లో 1గంట షోలు వేస్తున్నారు, అయితే ఈ షోలు 15 స్క్రీన్‌లలో మాత్రమే ఉంటాయని తెలుస్తోంది. అలాగే మల్టీప్లెక్స్‌లో ఉదయం 4 గంటల నుంచి షోలు ప్రారంభమవుతాయి. అయితే దీని పై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా గా వస్తున్న ఈ దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో
తెరకెక్కిందని తెలుస్తోంది. అర్ధరాత్రి షో నిర్వహించడం వల్ల వసూళ్లకు భారీగా పెరిగే అవకాశం ఉంది. దేవర పార్ట్ వన్ పై ప్రేక్షకుల్లో చాలా క్రేజ్ ఉంది. చాలా చోట్ల దేవర అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. యూఎస్‌లో ఈ కొత్త ట్రెండ్‌ని సెట్ చేసింది. ప్రీ-బుకింగ్ సేల్‌లో దేవర 45,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. యుఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్ దేవర ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైందని పోస్ట్‌కు క్యాప్షన్‌లో రాశారు...!!