తమిళ స్టార్
హీరో సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ.
శివ దర్శకత్వం వహిస్తున్న ఈ
మూవీ సూర్య 42 ప్రాజెక్ట్‌గా వస్తోంది. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ
మూవీ ౩డీ ఫార్మాట్‌లో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ
సినిమా నుంచి కంగువ గ్లింప్స్‌తో పాటు పోస్టర్‌లు విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఓవైపు కంగువ షూటింగ్ కంప్లీట్ చేసిన ఈ హీరో.. అటు
డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తన
44వ
మూవీ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఈ
సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ పై భారీ అంచనాలను పెంచేసింది.
మాస్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ ప్రాజెక్టులో సూర్య…
గ్యాంగ్ లీడర్ గా కనిపించనున్నట్లు సమాచారం. ఈ
సినిమా తోపాటు హిందీలో తెరకెక్కుతున్న సింగం మూవీలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇందులో
బాలీవుడ్ స్టార్
అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తున్నాడు. ఇదే కాకుండా ఇప్పుడు హిందీలో మరో ప్రాజెక్ట్ చేసేందుకు రెడీ అయ్యాడట. అయితే ఈసారి హీరోగా కాదు.. విలన్ పాత్రలో కనిపించనున్నాడని టాక్ నడుస్తుంది. ధూమ్ 1, 2, 3 చిత్రాలను అందించిన
ఆదిత్య చోప్రా ఇప్పుడు
ధూమ్ 4
కోసం కథను రెడీ చేస్తున్నాడట. గతంలో వచ్చిన మూడు పార్ట్స్ కంటే ఈసారి
ధూమ్ 4 వేరేలెవల్ ఉంటుందని టాక్. అయితే ఈ చిత్రంలో హీరోగా ఎవరు నటిస్తారు అనే విషయంపై క్లారిటీ రాలేదు. కానీ
తమిళ్ హీరో సూర్య ఇందులో విలన్ పాత్రలో కనిపించనున్నాడట. బీటౌన్ ఇండస్ట్రీలో 2004లో విడుదలైన
ధూమ్ సంచలన విజయాన్ని అందుకుంది.
బైక్ రేసింగ్స్, కారు చేజింగ్ లతో సరికొత్త యాక్షన్ ప్రేక్షకులకు చూపించారు. ఇక ఈ తర్వాత రెండేళ్ల గ్యాప్ లోనే వచ్చిన
ధూమ్ 2 కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇక దీంతో
ధూమ్ 3 చిత్రాన్ని కూడా అడియన్స్ ముందుకు వచ్చారు. కానీ
ధూమ్ 2, 3 చిత్రాలకు చాలా కాలం గ్యాప్ వచ్చింది...!!