ఫ్యాన్స్ గెట్ రెడీ.. దేవర గెలిస్తే.. టాలీవుడ్ గెలిచినట్టేనా..?

Divya
తెలుగు సినిమా పరిశ్రమ నుంచి విడుదలయ్య సినిమాలు రోజురోజుకి క్రేజ్ పెరిగిపోతూనే ఉంది. పాన్ వరల్డ్ సినిమాగా సినీ పరిశ్రమ ఎదుగుతోంది కానీ.. సినిమాల సక్సెస్ రేట్ మాత్రం పెద్దగా కనిపించడం లేదు. ఈ విషయాన్ని చాలామంది గుర్తించట్లేదు కూడా. గతంలో లాగా ప్రేక్షకులు కూడా థియేటర్లకు రావడం క్రమక్రమంగా తగ్గిపోతూనే ఉన్నది. కేవలం బడా స్టార్ హీరోల చిత్రాలు విడుదలై మంచి టాక్ వస్తేనే తప్ప ఎక్కువ రోజులు థియేటర్లో నిలవడం కష్టంగా మారుతోంది. కానీ సోషల్ మీడియా పుణ్యమా అంటు చాలా సినిమాలకు నెగిటివిటీ తీసుకువచ్చేలా చేస్తున్నారు.

అందుకు  కారణం స్టార్ హీరోల అభిమానుల మధ్య ఉండే వైర్యమే అని చెప్పవచ్చు. కేవలం ఒక్క హీరోకే ఎలిమినేషన్ ఇవ్వడం ఇతరుల హీరోలను తొక్కేయడం వంటివి అభిమానులు నెగెటివిటీతో ఎక్కువగా చేస్తున్నారు. అందుకే ఈ ఏడాది చాలామంది హీరోల సినిమాలు రేటింగ్ పరంగా తగ్గిపోయాయి. దీంతో తెలుగు సినీ పరిశ్రమ కూడా చాలా ఇబ్బందులు తప్పవనేలా కనిపిస్తోంది. కేవలం టాలీవుడ్ సినీ పరిశ్రమ మరో మూడు నెలలలో వచ్చే మూడు చిత్రాల మీద మాత్రమే ఆశలు పెట్టుకున్నది.. అందులో పుష్ప -2,దేవర , గేమ్ చేంజర్ వంటి సినిమాలు సక్సెస్ అయితే తప్ప టాలీవుడ్ కి కొత్త ఉపు రాదని చెప్పవచ్చు.

ముందుగా దేవర సినిమా మీద అందరి దృష్టి ఎక్కువగా ఆకట్టుకుంటోంది .ఈ సినిమా ట్రైలర్ కాస్త మిక్స్డ్ టాకు సంపాదించుకుంది.. కొంతమంది మిగతా హీరోల అభిమానులు కావాలని నెగటివ్గా ఈ సినిమా పైన తీసుకురావడం జరుగుతోంది. ఇప్పుడు ఒకవేళ అభిమానులు ఇలా చేశారంటే కచ్చితంగా ఇతర హీరోల అభిమానుల హీరో చిత్రాల విషయంలో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలానే చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. అందుకే దేవర సినిమా పైన నెగటివ్ తగ్గించడం చాలా వరకు అవసరం. దేవర సినిమా సక్సెస్ అయితే తెలుగు సినీ పరిశ్రమకు మంచి ఊపు లభిస్తుంది.. పాన్ ఇండియా లేవల్లో విడుదలై సక్సెస్ అయితే కచ్చితంగా మిగతా సినిమాలకు కూడా ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. పుష్ప -2, గేమ్ చేంజెర్ సినిమాలకు మరింత ప్లస్ కాబోతోంది. అందుకే దేవర సినిమా గెలిస్తే టాలీవుడ్ గెలిచినట్టే అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: