వామ్మో: గేమ్ ఛేంజర్ సినిమా వల్ల దిల్ రాజుకు అన్ని కోట్ల నష్టమా..?
గత కొంతకాలంగా ప్లాపులతో సతమతమవుతున్న డైరెక్టర్ శంకర్ భారతీయుడు-2 చిత్రంతో ఘోరమైన డిజాస్టర్ ని మూట కట్టుకున్నారు. ఇలాంటి సమయంలో గేమ్ ఛేంజర్ సినిమా మీద అందరి దృష్టి పడడం జరిగింది. ఈ సినిమా సక్సెస్ అవుతుందని చరణ్ అభిమానులు భావిస్తూ ఉండగా.. తమన్ ఈ సినిమా గురించి అప్పుడప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటారు. ఈ ఏడాది డిసెంబర్ 20న విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు. శంకర్ డిఫరెంట్ కథా అంశంతో ఈ సినిమాని తెరకెక్కించారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.
గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ తనదైన స్టైల్ ఆకట్టుకునేలా ఉండబోతున్నారని ఈ సినిమాతో కచ్చితంగా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంటారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ఇంటర్వెల్ సన్నివేశం కోసం ఏకంగా రూ .4కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్ రూ .350 కోట్లకు పైగా మారిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో వేస్టేజే సుమారుగా 80 నుంచి 100 కోట్ల వరకు సన్నివేశాలు చిత్రీకరించినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. దిల్ రాజ్ 50వ చిత్రం కాబట్టి ఈ సినిమాకి ఎంతైనా బడ్జెట్ పెడుతున్నారు. మరి రూ .100 కోట్ల రూపాయల వేస్టేజ్ అంటే అది నమ్మేలా లేదని అభిమానులు భావిస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి.