కొత్తగా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నవ దంపతులు అంటే అందరికీ ప్రస్తుతం గుర్తుకు వచ్చేది సిద్ధార్థ్ అదితిలే.. వీరిద్దరికీ మొదట పెళ్లిళ్లు అయ్యాయి. రిలేషన్స్ కూడా ఉన్నాయి.కానీ అవన్నీ పక్కన పెట్టేసి ఈ జంట తాజాగా పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఇక సిద్దార్థ్ అదితీలు 2 నెలల ముందే పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. కానీ ఈ విషయాన్ని ఈ మధ్యనే బయట పెట్టారని సమాచారం. ఇదంతా పక్కన పెడితే సిద్ధార్థ్ మేఘనకు విడాకులు ఇవ్వడానికి కారణం ఆయనకి ఇండస్ట్రీలో ఉన్న ఎఫైర్స్ అని తెలిసింది. అయితే అదితీ రావు హైదరి తన మొదటి భర్తకు విడాకులు ఎందుకు ఇచ్చింది.. అసలు మొదటి పెళ్లిని ఎందుకు రహస్యంగా ఉంచింది అనేది ఇప్పుడు చూద్దాం.. అదితీ రావు హైదరి సినిమాల్లోకి రాకముందే 21 ఏళ్ల వయసులోనే సత్య దీప్ మిశ్రాని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
అయితే ఈ విషయాన్ని అదితి బయట పెట్టే వరకు కూడా ఎవరికి తెలియదు. అలా పెళ్లయ్యాక సినిమాల్లోకి వచ్చి ఎన్నో హిందీ సినిమాల్లో నటించింది. ఇక మొదటిసారి ఈమె తెలుగులోకి సమ్మోహనం అనే మూవీతో ఎంట్రీ ఇచ్చింది. అయితే అదితీ రావు హైదరి ఓ సినిమా ఈవెంట్లో తాను విడాకులు తీసుకున్నట్టు ఒక సంచలన విషయం బయటపెట్టింది.అయితే ఆమె విడాకుల విషయం చెప్పేవరకు కూడా ఆమెకు పెళ్లయిందనే విషయం ఎవరికీ తెలియదు ఇక అదితి తన మొదటి పెళ్లిని రహస్యంగా ఉంచడానికి కారణం సినిమాల్లో అవకాశాలు రావనే ఉద్దేశంతో అలా చేసిందట.
కానీ చివరికి ఓ రోజు తన విడాకుల మ్యాటర్ బయట పెట్టడంతో అందరూ షాక్ అయిపోయారు. ఇక తన మొదటి భర్త అయినటువంటి సత్యదీప్ మిశ్రాకి విడాకులు ఇవ్వడానికి కారణం కూడా ఇండస్ట్రీలో ఉన్న ఓ హీరో అని,ఆ హీరోతో అదితి రావు హైదరీ రిలేషన్ లో ఉండడంతో భర్తకు విడాకులు ఇచ్చి ఆయనతో కొద్దిరోజులు డేటింగ్ చేసిందనే టాక్ వినిపించింది. అలా చివరికి ఆ నటుడితో కూడా బ్రేకప్ చెప్పుకొని లేడీస్ మ్యాన్ అయినటువంటి సిద్ధార్థ్ తో ప్రేమలో పడి ఆయన్ని పెళ్లి చేసుకుంది