రీజనల్ మూవీతోనే టాప్ ఫోర్ లో నిలిచిన మహేష్.. ఏకంగా ఆ రెర్ రికార్డ్..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన నటించిన సినిమాలకు ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా భారీ కలెక్షన్లు వస్తూ ఉంటాయి. అంత గొప్ప క్రేజ్ కలిగిన ఈయన ఈ సంవత్సరం గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కి నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ ఈ సినిమా కూడా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టింది. ఈ సినిమా ఈ సంవత్సరం విడుదల అయిన సినిమాలలో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలలో నాలుగవ స్థానంలో నిలిచింది.

ఈ సంవత్సరం విడుదల అయిన సినిమాలలో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో మొదటి స్థానంలో ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD మూవీ నిలిచింది. ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 183.20 గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలవగా ... ఆ తర్వాత విజయ్ హీరోగా రూపొందిన గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 104.75 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి రెండవ స్థానంలో నిలిచింది.

ఇక శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో రూపొందిన "స్త్రీ 2" మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 83.45 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి మూడవ స్థానంలో నిలిచింది. మహేష్ బాబు హీరోగా శ్రీ లీలా , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం సినిమా విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 79.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి నాలుగవ స్థానంలో నిలిచింది. ఈ సినిమాలో జయరామ్ , రమ్యకృష్ణ , ప్రకాష్ రాజ్ , రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలలో నటించగా ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: