గోట్ : యావరేజ్ టాక్ తోనే ఈ రేంజ్ ఊచకోత.. ఏకంగా అన్ని కోట్లు అవుట్..?

Pulgam Srinivas
తమిళ నటుడు తలపతి విజయ్ తాజాగా గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ సెప్టెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే తమిళనాడు , ఓవర్సీస్ రెండు ప్రాంతాల్లో మినహాయిస్తే అన్ని ప్రాంతాల్లో కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. అయిన కూడా ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి. ఇప్పటికే ఈ మూవీ హిట్ స్టేటస్ ను కూడా అందుకుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 13 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. మరి 13 రోజుల బాక్సా ఫీస్ రన్ ముగిసే సరికి ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయో అనే వివరాలను తెలుసుకుందాం.
13 రోజుల్లో ఈ సినిమాకు తమిళ నాడు ఏరియాలో 194.85 కోట్ల కలెక్షన్లు దక్కగా , తెలుగు రాష్ట్రాలలో 12.80 కోట్లు , కర్ణాటక ఏరియాలో 26.65 కోట్లు , కేరళ ఏరియాలో 12.85 కోట్లు , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 23.30 కోట్లు , ఓవర్సీస్ లో 150.30 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి 13 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 204.50 కోట్ల షేర్ ,  419.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 187 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ భారీ లోకి దిగింది. ఇప్పటి వరకు ఈ మూవీ 17.50 కోట్ల లాభాలను అందుకుంది. ఇకపోతే ఈ మూవీ కి తమిళ నాడు , ఓవర్సీస్ లో భారీ ఎత్తున కలెక్షన్లు వచ్చాయి. దానితో ఈ మూవీ కి నెగటివ్ టాక్ వచ్చిన కూడా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను చాలా ఈజీగా కంప్లీట్ చేసుకుంది. వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... స్నేహ , మీనాక్షి చౌదరి ఈ మూవీ లో హీరోయిన్లుగా నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: