త్రిష: అప్పుడు స్టార్ హీరో మోజులో అలాంటి నిర్ణయం.. ఇప్పుడు మరో సంచలన నిర్ణయం..!

Divya
టాలీవుడ్, కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన త్రిష ఇప్పటికీ కూడా యంగ్ హీరోయిన్లకు దీటుగా తన అందంతో ఆఫర్లను అందుకుంటు హీరోయిన్లకే షాక్ ఇస్తాంది. అయితే గతంలో ఎప్పుడు లేనంతగా విజయ్ నటించిన గోట్ చిత్రంలో ఒక ప్రత్యేకమైన పాటలో కనిపించింది. అయితే ఈ పాట చూసిన అందరూ కూడా ఆశ్చర్యపోయారు. త్రిష తన సినీ కెరీర్లో ఇప్పటివరకు ఎలాంటి ఐటెం సాంగ్ లో కూడా కనిపించలేదు. దీంతో కోలీవుడ్ లో కూడా త్రిష ,విజయ్ పైన పలు రకాల రూమర్స్ కూడా వినిపించాయి.

అంతేకాకుండా వీరిద్దరూ కలిసి కొన్ని సందర్భాలలో దిగిన ఫోటోలు కూడా వీరి మధ్య రూమర్స్ కు మరింత కారణమయ్యాయి అని చెప్పవచ్చు. విజయ్ మీద ప్రేమతోనే త్రిష గోట్ చిత్రంలో స్పెషల్ సాంగ్లో కనిపించిందనే  విధంగా రూమర్స్ వినిపించాయి.సినిమా మాత్రం మిక్స్డ్ టాక్ ను సంపాదించుకుంది అంటూ తెలుపుతున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది త్రిష. అదేమిటంటే తమిళంతో పాటు ఇతర భాషలలో ఇకమీదట ప్రత్యేకమైన పాటలలో నటించకూడదని నిర్ణయం తీసుకున్నదట.

విజయ్ తో తనకున్న బాండింగ్ వల్లే గోట్ సినిమాలో ఒప్పుకున్నదట.. పారితోషకం కోసం మాత్రం కాదని.. ఐటెం సాంగ్లలో ఇకమీదట నటించనని.. ఆ జోన్లోకి వెళ్తే తన కెరీర్ కూడా నాశనం అవుతుందని ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకుందట త్రిష. ప్రస్తుతం చిరంజీవి సరసన  విశ్వంభర పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నది అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా గతంలో షేర్ చేసింది. అలాగే కమలహాసన్, మణిరత్నం కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో కూడా హీరోయిన్గా త్రిష ఎంపికైనట్లు సమాచారం వీటితో పాటు పలు రకాల బడా ప్రాజెక్టులకు కూడా త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే విజయ్ కోసం స్పెషల్ సాంగ్లో నటించిన త్రిష ఇప్పుడు మళ్లీ అలాంటివి చేయనట్టు చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: