జానీ మాస్టర్ అరెస్ట్ కావడం జరిగింది. జానీ మాస్టర్ కు సంబంధించిన వార్త తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. గత మూడు రోజుల నుంచి జానీ మాస్టర్ వార్త హాట్ టాపిక్ అవుతోంది. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ అలాగే అత్యాచారం కూడా చేశాడని, అంతేకాకుండా పలుమార్లు తన ఇంటికి వచ్చి బలాత్కారం కూడా చేశాడంటూ ఓ లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే జానీ మాస్టర్ ను జనసేన పార్టీ సస్పెండ్ చేసింది.
అంతేకాకుండా ఈ వ్యవహారంపై ఫిలింఛాంబర్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరగాలని ప్రతి ఒక్కరు కోరుతున్నారు. ఈ విషయం గురించి జానీ మాస్టర్ సరిగ్గా స్పందించడం లేదు. ప్రస్తుతం జానీ మాస్టర్ నెల్లూరులో ఉన్నాడని సమాచారం మేరకు నార్సింగి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గత మూడు రోజుల నుంచి పరారీలో ఉన్న జానీ మాస్టర్ ఈరోజు పోలీసులకు చిక్కాడు. ఈ రోజు జానీ మాస్టర్ అరెస్టు అయ్యారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత జానీ మాస్టర్ ను ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కొద్దిసేపటి క్రితమే బెంగుళూరులో జానీ మాస్టర్ ని పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. 3 రోజులుగా బెంగళూరులోనే ఉన్నాడట. అయితే... మారువేశంలో వెళతుండగా అరెస్ట్ అయ్యాడు జానీ మాస్టర్. ఇక అటు జానీ మాస్టర్ బాధితురాలికి భద్రతను ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 15న జానీ మాస్టర్ పై కేసు నమోదు అయింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు జానిపై మొదటి మూడు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డు తర్వాత అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. జానీపై నాన్ బెయిలబుల్ కేసు ఉందని పోలీసులు చెబుతున్నారు.
వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామంటూ, మాపై ఎటువంటి ఒత్తిడి లేదని చెబుతున్నారు. ఇలాంటి కేసులలో పక్కా ఆధారాలు సేకరించాల్సి ఉంటుందని పోక్సో చట్టం కూడా యాడ్ చేశామని పోలీసులు వెల్లడించారు. కాగా, జనసేన పార్టీ సభ్యుడుగా జానీ మాస్టర్ ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ తరపున జానీ మాస్టర్ ప్రచారం నిర్వహించారు. అయితే జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జనసేన పార్టీ వారి కార్యకలాపాలకు దూరంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది.