పుష్ప 2 జాతర ఇక లేనట్టేనా? ట్విస్ట్ తెలిస్తే మతిపోతుంది గురూ!

frame పుష్ప 2 జాతర ఇక లేనట్టేనా? ట్విస్ట్ తెలిస్తే మతిపోతుంది గురూ!

Suma Kallamadi
పుష్ప 2 సినిమా గురించి ఇక్కడ పరిచయం అక్కర్లేదు. అల్లు వారి అబ్బాయి అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో చేసిన పుష్ప సినిమా ఎలాంటి ప్రభంజనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ‘పుష్ప 2’ షూటింగ్ ప్రస్తుతం జరుపుకుంటోంది. గత కొంత కాలంగా సుకుమార్ గ్యాప్ తీసుకోకుండా ఈ మూవీ షూటింగ్ మీదే పని చేస్తున్నారు. ఇప్పటికే కీలకమైన క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ పూర్తిచేశారని తెలుస్తోంది. రామోజీ ఫిలింసిటీలో సెట్లో జరిపిన ఈ ఎపిసోడ్ టోటల్ ‘పుష్ప 2’ సినిమాకే హైలెట్ గా నిలవనుంది అని వినికిడి.
‘పుష్ప 2’లోని యాక్షన్ ఘట్టాలు అన్ని కూడా హైవోల్టేజ్ లో గూస్ బాంబ్స్ క్రియేట్ చేసేలా సుకుమార్, ఫైట్ మాస్టర్ కూర్చొని డిజైన్ చేసారని తెలుస్తోంది. అసలు విషయం ఏమంటే, జాతర బ్యాక్ డ్రాప్ లో ఒక సాంగ్ ని చిత్రీకరించగా హైలైట్ గా వచ్చిందని టాక్ నడుస్తోంది. అయితే ఈ సాంగ్ ని సినిమా రిలీజ్ కి ముందు వదిలే ఛాన్స్ లేదనే గుసగుసలు బాగా వినబడుతున్నాయి. ఎందుకంటే ఈ జాతర సాంగ్ ని థియేటర్స్ లోనే ఆడియన్స్ ఎక్స్ పీరియన్స్ చేయాలని సుకుమార్ భావిస్తున్నారని టాక్. అందుకే ఈ సాంగ్ ని ముందస్తుగా రిలీజ్ చేసే ప్రయత్నం చేయడం లేదనే టాక్ నడుస్తోంది. కాగా రిలీజ్ తర్వాత జాతర సాంగ్ సెన్సేషన్ అవుతుందని మేకర్స్ ఆశ పడుతున్నారు.
ఇకపోతే, ఈ సినిమాలో మొత్తం 4 పాటలు ఉండగా ఇప్పటికే 2 సాంగ్స్ కి రిలీజ్ చేశారు. మిగిలిన రెండు సాంగ్స్ లో ఒకటి ఐటెం పాటగా ఉండబోతోంది. ఇక ఇక్కడ ట్విస్ట్ ఏమంటే, జాతర బ్యాక్ డ్రాప్ లోనే యాక్షన్ ఘట్టాలు అద్భుతంగా తెరకెక్కించినట్టు తెలుస్తోంది. మేగ్జిమమ్ పుష్ప 2 షూటింగ్ అక్టోబర్ నెల ఆఖరుకి కంప్లీట్ చేయొచ్చని అనుకుంటున్నారు. వీలైనంత స్ట్రాంగ్ గా ఈ సినిమాని మార్కెట్ లోకి తీసుకొని వెళ్లాలని సినిమా నిర్మాతలు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ అనుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా 550 వరకు థీయాట్రికల్ బిజినెస్ జరిగిపోయింది. ఈ స్థాయిలో కలెక్షన్స్ ని అందుకోవాలంటే మౌత్ టాక్ అయితే గట్టిగా ఉండాలి... లేకపోతే కష్టం. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడీగా రష్మిక మందన నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: