శర్వానంద్ ఈసారి మాస్ డైరెక్టర్ వస్తున్నాడు.. అంతకుమించిన కథతో?

Suma Kallamadi
నటుడు శర్వానంద్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా పరిశ్రమలో వైవిధ్యభరితమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఎవరన్నా ఉన్నారంటే అందులో ముందులో వరుసలో ఉంటాడు శర్వా. ఈ క్రమంలోనే ఇప్పుడు రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఓ కొత్త ప్రాజెక్టును ప్రకటించాడు. నిన్న మొన్నటి వరకు క్లాస్ క్యారెక్టర్స్ లలో ఎక్కువగా కనిపించిన శర్వా ఇప్పుడు కంప్లీట్ డిఫరెంట్ మాస్ క్యారెక్టర్ తో తెరపైకి రాబోతున్నాడు.
శర్వా 38 ప్రాజెక్టుగా తెరపైకి రాబోతున్న ఈ సినిమా మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో రాబోతోంది. ఇప్పటివరకు సంపత్ నంది తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్ తో మాస్ ఎంటర్‌టైనర్స్‌ సినిమాలు చేస్తూ వచ్చాడు. రామ్ చరణ్ రచ్చ, రవితేజ తో బెంగాల్ టైగర్, గోపిచంద్ తో గౌతమ్ నంద, సీటీమార్ లాంటి సినిమాలు చేసి మంచి మేకర్ అనిపించుకున్నాడు. ఈ సినిమాలు కమర్షియల్ గా కూడా కలెక్షన్ల వర్ధం కురిపించాయి. అయితే మాస్ డైరెక్టర్ గా సంపత్ ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా శర్వా 38వ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సినిమాకు సంబంధించిన ఒక కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఉత్తర తెలంగాణా, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని 1960 దశక కాలంలో జరిగే కథ అని వినికిడి. భయంతో నడిచే ప్రపంచంలో రక్తం అనేక సమస్యలకు పరిష్కారంగా నిలిచే కథగా తెలుస్తోంది. ఈ కథను పాన్ ఇండియా స్థాయిలో నిర్మించడమే కాకుండా, శర్వా కూడా 1960ల కాలం పాత్రలో కనిపించడానికి సరికొత్త లుక్‌ టెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తోంది. సంపత్ నంది మరియు శర్వా కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా మొదటిసారి ఇద్దరికీ కూడా పాన్ ఇండియా చిత్రంగా నిలవనుంది. దర్శకుడు చాలా కాలంగా ఈ కథపై వర్క్ చేసినట్టు వినికిడి. కాగా ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: