ప్రపంచంలోనే టాప్ వెబ్ సిరీస్..స్క్విడ్ గేమ్ సీక్వెల్ రిలీజ్ డేట్ లాక్..!

Divya
ప్రపంచవ్యాప్తంగా చాలామందిని భయపెట్టించిన వెబ్ సిరీస్లలో స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 2021లో నెట్ ఫ్లిక్స్ లో విడుదలై ఒక సంచలనం సృష్టించింది. సరికొత్త రికార్డులను కూడా తిరగరాసింది.ఈ వెబ్ సిరీస్.1.65 బిలియన్ల మంది  ఎక్కువమంది వీక్షించిన వెబ్ సిరియస్ గా కూడా పేరు సంపాదించింది. ఇప్పుడు ఈ సిరీస్ కి సీక్వెల్ గా స్క్విడ్ గేమ్-2 రాబోతున్నది. త్వరలోనే అందుకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తి చేయబోతున్నట్లు తెలియజేయడమే కాకుండా రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు.

ఈ ఏడాది డిసెంబర్ 26వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రిమ్మింగ్ కాబోతోందట. అందుకు సంబంధించి చిత్ర బృందం కూడా అధికారికంగా ఈ సిరీస్ టీజర్ కు సంబంధించి ఒకసారి కొత్త అప్డేట్ ను కూడా ప్రకటించారు. దీంతో ఈ వెబ్ సిరీస్ పైన అప్పుడే మంచి బజ్ ఏర్పడుతోంది. ది గేమ్ విల్ నాట్ స్టాప్ అనే విధంగా ఒక ఆసక్తికరమైన టైటిల్ తో పోస్టర్ని సైతం విడుదల చేశారు చిత్ర బృందం. అలాగే రెడీ ఫర్ ది నెక్స్ట్ లెవెల్ అంటూ కూడా నెట్ ఫ్లిక్స్ సరికొత్త పోస్టర్ని క్యాప్షన్ ఇస్తూ పోస్ట్ చేశారు. హీరో ఈ గేమ్ ను ఎవరు నిర్వహిస్తున్నారు వారిని పట్టుకుంటానని సీజన్ వన్ చివరిలో శఫదం చేస్తారు.. ఇప్పుడు సీజన్-2 తోనే మొదలుపెట్టడంతో హీరో స్క్విడ్ గేమ్ నిర్వహించే వారిని హీరో పట్టుకుంటారా లేదా అనేది ఈ సీజన్లో ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.

వెబ్ సిరీస్ యూజర్స్,స్క్విడ్ గేమ్ యూజర్స్ సైతం సీక్వెల్లో మరింత భయంకరంగా ఉంటాయనే విషయం పైన చర్చించుకుంటున్నారు. ఈసారి కూడా లేజంగ్ జే , విహాజున్ తదితరులు కొరియన్ యాక్టర్స్ ఇందులో నటించబోతున్నారట..స్క్విడ్ గేమ్ స్టోరీ విషయానికి వస్తే.. అప్పులతో ఇబ్బందులకు గురవుతున్న కొంతమంది ప్రజలను ప్రపంచానికి దూరంగా ఒక దీవికి తీసుకువెళ్లి అక్కడ పలు రకాల గేమ్స్లలో ఆడిస్తూ ఓడిపోయిన వారిని చంపేస్తూ ఉంటారు.. అయితే చివరికి ఎవరైతే మిగులుతారో వారికి ప్రైజ్ మనీని అందిస్తారు.. ఇలాంటి విభిన్నమైన కాన్సెప్ట్ తో తీసుకువచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: