బాలయ్య కారణంగా టెన్షన్లో బోయపాటి.. ఇప్పటికే అలాంటి పరిస్థితి..?

frame బాలయ్య కారణంగా టెన్షన్లో బోయపాటి.. ఇప్పటికే అలాంటి పరిస్థితి..?

Pulgam Srinivas
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు మేకర్స్ ఇప్పటివరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఎన్పీకే 109 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే బాలయ్య , బోయపాటి దర్శకత్వంలో అఖండ 2 మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. చాలా రోజుల క్రితం బోయపాటి "అఖండ 2" మూవీ కి సంబంధించిన కథ పనులు పూర్తి అయినట్లు తెలియజేశాడు. ఆ అనౌన్స్మెంట్ ఇచ్చి ఇప్పటికే చాలా కాలం అవుతుంది.

ఇటు చూస్తే బాలయ్య , బాబి తో చేస్తున్న ఎన్బికే 109 షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా టైటిల్ ను కూడా ఇంకా ప్రకటించలేదు. ఈ మూవీ విడుదల తేదీని కూడా ఇప్పటివరకు ప్రకటించలేదు. ఈ సినిమా నుండి రెండు ప్రోమో లను విడుదల చేశారు. కానీ ఈ సినిమా షూటింగ్ ఎంత భాగం పూర్తి అయ్యింది అనే దానిపై కూడా పెద్దగా క్లారిటీ లేదు. ఇప్పటికే బోయపాటి "అఖండ 2" సినిమాకు సంబంధించిన కథను పూర్తి చేసినట్లు చెప్పి కూడా చాలా రోజులు అవుతుంది. మరి తొందరగా బాలయ్య , బాబి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ని పూర్తి చేసి నట్లయితే బాలయ్య తో బోయపాటి సినిమా తొందరగా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే బోయపాటి  ,రామ్ పోతినేని హీరోగా స్కంద అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ ఘోర పరాజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుంది. ఇలా ప్లాప్ తర్వాత బోయపాటి ప్రస్తుతం బాలయ్య కోసం ఎదురు చూస్తూ సమయాన్ని వృధా చేస్తున్నాడు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: