కొన్ని సంవత్సరాల క్రితం వరకు మెగా , అల్లు కుటుంబాల మధ్య ఎంతో సన్నిహిత్యం ఉండేది. చిరంజీవి అభివృద్ధికి అల్లు అరవింద్ , అల్లు అరవింద్ అభివృద్ధికి చిరంజీవి ఎంతో దోహదపడి ఒకరికి ఒకరు ఎంతో సహాయంగా ఉంటూ ఇద్దరు కూడా తెలుగు సినీ పరిశ్రమలో మంచి స్థాయికి ఎదిగారు. ఇక ఈ మధ్య కాలంలో మాత్రం వీరి కుటుంబాల మధ్య విభేదాలు వచ్చినట్లు అనేక కథనాలు వస్తున్నాయి. ఆ కథనాలకు తగినట్లుగానే ఈ కుటుంబంలోని కొంత మంది ప్రవర్తన ఉండడంతో ఆ కథనాలకు మరింత బలం చేకూరుతుంది.
అసలు విషయం లోకి వెళితే ... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీని స్థాపించిన విషయం మనకు తెలిసిందే. ఇక కొన్ని రోజుల క్రితం జరిగిన ఎన్నికలలో అల్లు అర్జున్ వైసీపీ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేశాడు. ఇక్కడి నుండి అసలు కథ మొదలైంది. ఆ తర్వాత నుండి మెగా , అల్లు కుటుంబాల మధ్య గొడవలు రేకెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక కొంత కాలం క్రితం అల్లు అర్జున్ ఓ సినిమా ఈవెంట్లో భాగంగా నేను నా ఫ్యాన్స్ ను చూసుకొని ఇండస్ట్రీలోకి వచ్చాను అని చెప్పాడు. దీనితో సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలి అంటూ అనేక వార్తలు మొదలయ్యాయి.
ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ విడుదల కానుంది. ఈ సినిమా డిసెంబర్ 6 వ తేదీన విడుదల కానుంది. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ మూవీ ని డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ఈ రెండు సినిమాలు కూడా కేవలం రెండు వారాల గ్యాప్ తో విడుదల కానున్నాయి. దీనితో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వార్ కన్ఫామ్ అన్నట్టుగా కనిపిస్తుంది. మరి ఈ రెండు సినిమాలలో ఏ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.