చిరు రిజెక్ట్ చేశాడు.. మోహన్ బాబు బ్లాక్ బాస్టర్ కొట్టాడు.. ఆ మూవీ ఏంటో తెలుసా..?

frame చిరు రిజెక్ట్ చేశాడు.. మోహన్ బాబు బ్లాక్ బాస్టర్ కొట్టాడు.. ఆ మూవీ ఏంటో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
మెగాస్టార్ చిరంజీవి , కే రాఘవేంద్రరావు కాంబి నేషన్లో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీలు వచ్చాయి . ఇక ఒకా నొక సమయం లో చిరంజీవి తో రాఘవేంద్రరావు ఓ సినిమాను ప్లాన్ చేసి స్టోరీ మొత్తం రాసుకున్న తర్వాత ఆ సినిమాను చిరంజీవి తో కాకుండా మోహన్ బాబు తో చేశాడు . ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది . మరి చిరంజీవి కోసం రాసుకున్న కథను ఎందుకు మోహన్ బాబు తో రాఘవేంద్రరావు తీశాడు . ఆ మూవీ ఏది అనే వివరాలను తెలుసుకుందాం . కొన్ని సంవత్సరాల క్రితం కే రాఘవేంద్రరావు , మోహన్ బాబు హీరోగా అల్లుడు గారు అనే మూవీ ని రూపొందించాడు.

ఇందులో శోభన హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. రాఘవేంద్రరావు ఈ సినిమాలో హీరోగా మొదటగా చిరంజీవిని హీరోగా తీసుకోవాలి అనుకున్నాడు. ఇక సినిమా కథ మొదట చిరంజీవిని తీసుకోవాలి అనుకున్న కథ మొత్తం పూర్తి అయ్యాక ఒక రోజు రాఘవేంద్రరావు ఫోన్ చేసి చిరంజీవితో నీతో అల్లుడు గారు అనే టైటిల్తో ఓ సినిమా చేయాలి అనుకున్నాను. కానీ అది ఇప్పుడు చేయడం కుదరదు అన్నాడటా. ఎందుకు సార్ అని చిరంజీవి ప్రశ్నించగా... ఆ సినిమా కథ అద్భుతంగా ఉంది.

కానీ క్లైమాక్స్ లో హీరో చనిపోయేలా ఆ క్లైమాక్స్ ఉంటుంది. ఇంత పెద్ద స్టార్ డమ్ ఉన్న నువ్వు చనిపోయావు అంటే ప్రేక్షకులు ఒప్పుకోరు. సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆ కథను వేరే వాళ్ళతో చేస్తాను అన్నాడట. దానితో ఆయన కూడా ఓకే అన్నాడట. ఆ తర్వాత మోహన్ బాబుతో ఆ సినిమాను రూపొందించడం , అది అద్భుతమైన విజయం సాధించడం జరిగినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: