పుష్ప 2 : ఆ విషయంలో ఫ్యాన్స్ కు నిరుత్సాహం మిగలనుందా..?

frame పుష్ప 2 : ఆ విషయంలో ఫ్యాన్స్ కు నిరుత్సాహం మిగలనుందా..?

MADDIBOINA AJAY KUMAR
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... సుకుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ను ఫుల్ స్పీడ్ గా పూర్తి చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్ నెల చివరి వరకు ఈ మూవీ కి సంబంధించిన మొత్తం షూటింగ్ పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఆ వార్త అల్లు అర్జున్ అభిమానులకు కాస్త నిరుత్సాహాన్ని కలిగించే అవకాశం ఉంది. అది ఏమిటి అంటే ... ఈ సినిమాలో ఓ జాతర పాట ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ పాట యొక్క లిరికల్ వీడియోను సినిమా విడుదలకు ముందు రిలీజ్ చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం లేనట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ ను నేరుగా థియేటర్ లోనే చూసే విధంగా మేకర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఇక మొత్తం ఈ సినిమాలో నాలుగు పాటలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ నాలుగు పాటలను నుంచి ఇప్పటికే రెండు పాటలను విడుదల చేశారు. మేకర్స్ ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదల చేసిన రెండు పాఠాలకు అద్భుతమైన రెస్పాండ్ జనాల నుండి లభించింది. ప్రస్తుతానికి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa

సంబంధిత వార్తలు: