నాని లాస్ట్ 3 మూవీలకి షాకింగ్ కలెక్షన్స్..?

frame నాని లాస్ట్ 3 మూవీలకి షాకింగ్ కలెక్షన్స్..?

MADDIBOINA AJAY KUMAR
నాచురల్ స్టార్ నాని పోయిన సంవత్సరం దసరా , హాయ్ నాన్న అనే రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించి రెండింటితో కూడా మంచి విజయాలను అందుకున్నాడు. ఈ సంవత్సరం సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని కూడా నాని అందుకున్నాడు. మరి ఈ మూడు మూవీలతో నాని ఏ రేంజ్ కలెక్షన్లను అందుకున్నాడు అనే వివరాలను తెలుసుకుందాం.

నాని పోయిన సంవత్సరం మొదటగా దసరా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కీర్తి సురేష్ ఈ మూవీలో హీరోయిన్గా నటించగా , శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకు మొత్తంగా 115 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ తర్వాత నాని "హాయ్ నాన్న" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని మృణాల్ ఠాకూర్ , నాని కి జోడిగా నటించగా , శౌర్యవ్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 74.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. 

ఇలా పోయిన సంవత్సరం రెండు మూవీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండింటితో మంచి విజయాలను అందుకున్న నాని ఈ సంవత్సరం సరిపోదా శనివారం అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ నటించగా , వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఇప్పటికే 95 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా మరికొన్ని కలెక్షన్లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మొత్తంగా ఈ మూడు సినిమాల ద్వారా నాని 285 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: