ఆ మూవీ బ్లాక్ బస్టర్ అని సంబరాల్లో ఉన్న ప్రభాస్ కు షాక్ ఇచ్చిన నిర్మాత..?

MADDIBOINA AJAY KUMAR
రెబల్ స్టార్ ప్రభాస్ కొన్ని సంవత్సరాల క్రితం మున్నా అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదల అయిన రోజు ఈ మూవీ బ్లాక్ బాస్టర్ అనే సంబరాల్లో ప్రభాస్ ఉండగా ఓ నిర్మాత వచ్చే సినిమా ఫ్లాప్ పెద్దగా ఏమీ లేదు అని చెప్పి ప్రభాస్ ను డిసప్పాయింట్ చేశాడట. ఇంతకీ ఆ నిర్మాత ఎవరు అనుకుంటున్నారా ..? ఆయనే దిల్ రాజు. ఒకానొక ఇంటర్వ్యూలో దిల్ రాజు "మున్నా" మూవీ రిజల్ట్ గురించి చెప్పుకొచ్చాడు. కొంత కాలం క్రితం దిల్ రాజు "మున్నా" మూవీ గురించి మాట్లాడుతూ.. ఆ సినిమా చిత్రీకరణ దశలో ఉండగా ఆ మూవీ కచ్చితంగా హిట్ అవుతుంది అని మేమంతా అనుకున్నాం.

ఇక సినిమా విడుదల అయింది. సినిమా నేను ఆడియన్స్ తో కలిసి థియేటర్లలో చూశాను. ఎక్కడో తేడా కొడుతుంది అంత గొప్పగా జనాలు ఫీల్ అవ్వడం లేదు. దానితో నాకు అర్థం అయింది. ఈ సినిమా పెద్ద గొప్ప స్థాయి విజయన్ని అందుకోదు అని. అది చెబుదామని ప్రభాస్ ఇంటికి వెళ్లాను. అప్పటికే కొంత మంది ప్రభాస్ కి సినిమా బ్లాక్ బాస్టర్ అని చెప్పడంతో ఆయన తన ఫ్రెండ్స్ తో కలిపి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ప్రభాస్ దగ్గరికి నేను వెళ్లాను. ఆయన నా దగ్గరికి వచ్చి బ్లాక్ బాస్టర్ కొట్టాం సార్ అన్నాడు.

నేను ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాదు మహా అయితే యావరేజ్ అవుతుంది. అంతకుమించి కాదు అన్నాను. ఏంటి సార్ అలా అంటున్నారు. బయట అంతా బ్లాక్ బస్టర్ అంటున్నారు కదా అన్నాను. నీకు ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను ఇప్పుడే సినిమా చూశాను. సినిమా అంత పెద్ద సక్సెస్ కాదు అన్నాను. ఇక రిజల్ట్ అలాగే వచ్చింది అని దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: