జర్నీ : కల్ట్ క్లాసిక్ మూవీ.. మరోసారి థియేటర్స్ లోకి.. రీరిలీజ్ ఎప్పుడంటే..?

murali krishna
ఇన్ని రోజులు తెలుగు సినిమాలు మాత్రమే రీ రిలీజ్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు డబ్బింగ్ సినిమాల రీ రిలీజ్ ట్రెండ్‌ మొదలైంది. ధనుష్ '3' సినిమా కి వస్తున్న రెస్పాన్స్ నేపథ్యంలో ఇదే నెలలో మరో డబ్బింగ్ మూవీ 'జర్నీ' ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. తెలుగు హీరో శర్వానంద్ ఈ చిత్రంలో ఒక హీరోగా నటించడం వల్ల కచ్చితంగా మంచి క్రేజ్‌ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎం శరవణన్‌ దర్శకత్వంలో రూపొందిన 'ఎంగేయుమ్ ఎప్పోతుమ్' సినిమాకు జర్నీ డబ్బింగ్ వర్షన్‌. 13 ఏళ్ల క్రితం థియేటర్ లలో సందడి చేసిన జర్నీ మళ్లీ ఇప్పుడు థియేట్రికల్‌ రీ రిలీజ్ కు సిద్ధం అయింది. సెప్టెంబర్‌ 21, 2024న జర్నీ ని మళ్లీ థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారిక ప్రకటన వచ్చింది. లక్ష్మీ నరసింహ మూవీస్ ద్వారా సుప్రియ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతోన్నారు.శర్వానంద్, అనన్య, జై, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జర్నీ’.2011 డిసెంబర్ 16న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్‌ను అందుకుందో అందరికీ తెలిసిందే. తమిళ్ డబ్బింగ్ మూవీగా తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ‘జర్నీ’ పాటలు అప్పటి కుర్రకారుని కట్టి పడేశాయి. రెండు ప్రేమ కథలు సమాంతరంగా చూపించిన తీరు అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా.. ఎమోషనల్‌కి గురి చేసింది. అప్పటి ఈ మ్యాజికల్ లవ్ స్టోరీని లక్ష్మీ నరసింహ మూవీస్ ఇప్పుడు మళ్లీ తెరపైకి తీసుకొస్తోంది.ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ ఏ విధంగా ఉందో తెలిసిందే. ఈ క్రమంలో సెప్టెంబర్ 21న ఈ ‘జర్నీ’ మూవీని రీ రిలీజ్ చేసేందుకు లక్ష్మీ నరసింహ మూవీస్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో రీ రిలీజ్‌కు సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. దాదాపు 13 ఏళ్ల తరువాత మళ్లీ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుప్రియ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ సినిమా రీ రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి.హార్ట్ టచ్చింగ్ ఎమోషనల్ మూవీగా వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను సైతం అలరించి.. భారీ బ్లాక్‍బాస్టర్ అయింది. మరి ఇప్పుడీ సినిమా ఇప్పటి ఆడియెన్స్‌ని ఎలా ఆకట్టుకుంటుందో.. అప్పటి ఆడియెన్స్‌కు ఎంతలా నోస్టాల్జిక్ ఫీలింగ్ ఇస్తుందో చూడాలి. ఆల్రెడీ బుకింగ్స్ జోరందుకున్నాయని బుక్ మై షో ట్రెండ్ చూస్తే తెలుస్తోంది.దర్శకుడు ఎం. శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని AR మురుగదాస్ ప్రొడక్షన్స్ మరియు ఫాక్స్ స్టార్ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి సి. సత్య సంగీతాన్ని అందించాడు. 4కె వెర్షన్ లో రీ-రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: