తప్పుడు వార్తలతో అరుంధతి మూవీని వదిలేసింది.. ఆ తర్వాత హిట్లు లేక అలాంటి పరిస్థితి..?

frame తప్పుడు వార్తలతో అరుంధతి మూవీని వదిలేసింది.. ఆ తర్వాత హిట్లు లేక అలాంటి పరిస్థితి..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో లేడీ ఓరియంటెడ్ మూవీగా వచ్చి సంచలనాలు సృష్టించిన సినిమాల్లో అరుంధతి మూవీ ఒకటి. ఈ మూవీలో అనుష్క ప్రధాన పాత్రలో నటించగా , కోడి రామకృష్ణ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఈ మూవీ ద్వారా ఒక్కసారిగా అనుష్క క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ మూవీ తర్వాత ఈమె ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించిన అరుంధతి స్థాయి విజయాలను మాత్రం అందుకోలేదు. కనీసం అరుంధతి సినిమా దరిదాపుల్లోకి కూడా ఈమె నటించిన ఏ లేడీ ఓరియంటెడ్ మూవీ రాలేదు.

దాంతోనే అర్థం అవుతుంది ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంది అనేది. మరి ఇంత గొప్ప స్థాయి విజయాన్ని అందుకున్న ఈ సినిమాలో అనుష్క పాత్రకు మొదట ఎవరినో తెలుసా..? ఆమె ఎందుకు ఈ సినిమాని వదిలేసిందో తెలుసా..? చిన్న కారణంతో ఆ మూవీ ని వదిలేసి ఇప్పుడు తెగ బాధపడుతుంది. అసలు ఏం జరిగింది అనే వివరాలను తెలుసుకుందాం. అరుంధతి సినిమాలో అనుష్క ను కాకుండా మమతా మోహన్ దాస్ ను తీసుకుందాం అని కోడి రామకృష్ణ , శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇద్దరు అనుకున్నారట. అందులో భాగంగా ఈమెను సంప్రదించారట. ఆమె కూడా ఓకే చెప్పిందట. కానీ ఓకే చెప్పిన తర్వాత ఈమెకు ఆ బ్యానర్ మంచిది కాదు. ఆ బ్యానర్ వాళ్ల దగ్గర డబ్బులు లేవు. ఇలా అనేక వార్తలు ఆమెకు కొంత మంది చెప్పారట.

దానితో భయమేసి ఈమె సినిమా చేయలేను అందట. కానీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాత్రం ఆ పాత్రకు ఆమె బాగుంటుంది అని అనేక ప్రయత్నాలను చేశాడట. కానీ ఈమె మాత్రం అందులో నటించాలి అనుకోలేదట. ఈ విషయాన్ని ఈమె స్వయంగా చెప్పింది. ఇక ఆ తరువాత అనుష్క ను అరుంధతి సినిమాలో మెయిన్ లీడ్ గా అనుకోవడం , సినిమాను రూపొందించడం , విడుదల అయ్యి ఆ సినిమా బ్లాక్ బస్టర్ జరగడం జరిగింది. అలా మమతా మోహన్ దాస్ "అరుంధతి" మూవీని చేజేతులారా మిస్ చేసుకుంది. ఇక ఆ తర్వాత ఈమెకు కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చిన అందులో ఒకటి , రెండు మాత్రమే మంచి విజయాలను అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: