క ళ తప్పిన శుక్రువారం !

Seetha Sailaja
వచ్చేవారం విడుదల కాబోతున్న జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ గురించి తారక్ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడ ఆశక్తిగా ఎదురు చూస్తున్నాయి. దీనితో తుఫాన్ ముందు ప్రశాంతత లా ఈ శుక్రువారం ధియేటర్లలో పెద్దగా సందడి కనిపించదు అన్న సంకేతాలు వస్తున్నాయి.

వాస్తవానికి ఈరోజు కూడ చాల చిన్న సినిమాలు క్యూ కడుతున్నాయి. అయితే ఈసినిమాలలో ఏసినిమా పైనా పెద్దగా మాత్రమే కాదు కనీసపు అంచనాలు కూడ కనిపించడంలేదు. నిన్న మొన్నటి వరకు హడావిడి చేసిన సుహాస్ ‘గొర్రె పురాణం’ హడావిడి కూడ లేదు. ఈసినిమాతో పాటు  ‘హైడ్ అండ్ సీక్’ ‘చిక్లెట్స్’ ‘మన్యంధీరుడు’ ‘సీతారామరాజు’ ‘బీచ్ రోడ్’ ‘చేతన్’ ‘100 క్రోర్స్’ అనే చిన్న సినిమాలు ఈరోజు విడుదల అవుతున్నాయి.

అయితే ఈ సినిమాలలో నటీనటుల పేర్లు కూడ ఎవరికీ తెలియదు. ఈ సినిమాలతో పాటు రజనీకాంత్ ‘శివాజీ’ సిద్దార్థ్ ‘బొమ్మరిల్లు’ శర్వానంద్ ‘జర్నీ రీ రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 27న ‘దేవర’ పార్ట్ 1 రాబోతున్న నేపథ్యంలో అంచనాలు ఉన్న ఏసీనిమాను విడుదల చేయడానికి ఏనిర్మాత సాహసించక పోవడంతో ఈ శుక్రువారం ఎటువంటి సందడి లేకుండా ఉండబోతోంది. ఇప్పటికే ‘మత్తువదలరా 2’ లాభాల బాట పట్టడంతో ఈవారం కూడ ఈసినిమాకు అన్నివిధాల కలిసి వచ్చేలా కనిపిస్తోంది.

100 కోట్ల గ్రాస్ దాటేసిన ‘సరిపోదా శనివారం’ ఈ నెలాఖరుకి ఓటిటి లో వచ్చే అవకాశమున్నప్పటికీ ఈవారం కూడ ఈసినిమాను ప్రేక్షకులు చూసే ఆస్కారం ఉంది. ఇది ఇలా ఉండగా ఈ ఆదివారం నుండి తెలుగు రాష్ట్రాలలో బుక్ మై షో యాప్ లో ‘దేవర’ అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్లు ఓపెన్ అయ్యే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఎలాంటి హడావిడి లేకుండా విడుదల అవుతున్న ఈచిన్న సినిమాలలో ఏఒక్క చిన్న సినిమా హిట్ అయినా ‘దేవర’ వచ్చే వరకు ఆ హిట్ అయిన చిన్న సినిమా హడావిడి కొనసాగే ఆస్కారం ఉంది..    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: