చిరును షేక్ చేసిన చిన్న హీరో.. దెబ్బకు హడలెత్తిపోయి అలాంటి నిర్ణయం..?

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవికి ఏ రేంజ్ స్టార్ డమ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎవరి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిరంజీవి సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వెళ్ళాడు. చిన్న చిన్న పాత్రలో కూడా గొప్ప నటనను కనబరిచిన చిరంజీవికి ఆ తర్వాత సినిమాల్లో హీరోగా అవకాశాలు దక్కడం మొదలు అయింది. హీరోగా అవకాశాలు దక్కిన సమయంలో కూడా ఈయన ఎంతో జాగ్రత్తగా కెరియర్ను ముందుకు సాగించాడు. దానితో ఒక్కో విజయాన్ని అందుకుంటూ ఎంతో మంది హీరోలను దాటుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో స్థాయికి చేరుకున్నాడు.

స్టార్ హీరో పొజిషన్ లో కూడా అనేక సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా కెరియర్ను కొనసాగించాడు. ఇకపోతే చిరంజీవి ప్రస్తుతం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సోషియో ఫాంటసీ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. త్రిష ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా , ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. యువి సంస్థ వారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితం ప్రకటించారు. ఈ మూవీ విడుదల తేదీ ప్రకటించి చాలా కాలమే అవుతున్న ఈ మూవీకి సంబంధించిన ప్రచార చిత్రాలను మాత్రం పెద్ద స్థాయిలో మేకర్స్ విడుదల చేయలేదు. ఇక ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతుంది.

ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు , విశ్వంభర మూవీ విడుదల వాయిదా పడనున్నట్లు , ఆ తేదీనే సందీప్ కిషన్ మూవీ విడుదల కానున్నట్లు ఓ వార్త తెగ వైరల్ అయింది. దానితో వెంటనే విశ్వంభర యూనిట్ ఉలిక్కిపడింది. విశ్వంభర మూవీ దర్శకుడు మల్లాడి వశిష్ట "విశ్వంబర" మూవీ వచ్చే సంవత్సరం జనవరి 10వ తేదీన ఖచ్చితంగా వస్తుంది అని సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశాడు. ఇలా సందీప్ కిషన్ మూవీ వల్ల మెగాస్టార్ చిరంజీవి మూవీ యూనిట్ ఒక్క సారిగా స్పందించి అప్డేట్ ను ఇచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: