ఎన్టీఆర్ అడిగిన బాలకృష్ణతో చేయడానికి నో చెప్పిన ఆ స్టార్ హీరోయిన్.. ఆ తప్పు వల్ల కెరియర్స్ స్మాష్..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ ఎన్టీఆర్ కి ఎంత గొప్ప గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని అంచలంచలుగా పెంచిన వ్యక్తులలో సీనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన ఎన్నో రకాల సినిమాలలో నటించి అద్భుతమైన విజయాలను అందుకొని తెలుగు సినిమా ఖ్యాతిని ఎంతగానో పెంపొందించాడు. అంత గొప్ప గుర్తింపును ఈయన నట వారసుడిగా నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. బాలకృష్ణ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా తక్కువ కాలంలోనే అనేక విజయాలను అందుకొని స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు.

సీనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన స్థాయిలో కెరియర్ను కొనసాగిస్తూ , బాలకృష్ణ కూడా స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలో ఒక నటిని బాలకృష్ణ సినిమాలో నటించమని సీనియర్ ఎన్టీఆర్ ఏకంగా ఆఫర్ ఇచ్చిన ఆమె ఆ ఆఫర్ ను కాదందట. ఆ బ్యూటీ ఎవరు ..? ఎందుకు వద్దంది అనే విషయాలను తెలుసుకుందాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో యమునా ఒకరు. యమున 90 వ దశకంలో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈమె తన జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చింది. తాజాగా యమునా మాట్లాడుతూ... నేను సినిమా ఇండస్ట్రీలో కెరియర్ను మొదలు పెట్టిన సమయంలో చాలా అమాయకంగా ఉండేదాన్ని. ఈ సినిమాల్లో నటించాలో ఏ మూవీలో నటించకూడదు అనే క్లారిటీ నాకు పెద్దగా ఉండేది కాదు.
 

సినిమాల్లో హీరోయిన్ పాత్ర అయితే చాలు చేసే దానిని. మంచి పాత్ర అయినా హీరోయిన్ కాకపోతే చేసే దానిని కాదు. ఇక నా గురించి ఒక సారి సీనియర్ ఎన్టీఆర్ విన్నారట. మంచి అమ్మాయి , చాలా బాగా నటిస్తోంది అని ఎవరు ఆయనకు చెప్పారట. దానితో బాలకృష్ణ సినిమాలో నటించమని నాకు ఆఫర్ కూడా ఇచ్చారు. కానీ ఆ సమయంలో నేను వరస సినిమాలతో బిజీగా ఉండడం వల్ల డేట్లు అడ్జస్ట్ చేయలేక ఎన్టీఆర్ చెప్పినా కూడా బాలకృష్ణ సినిమాలో నటించలేకపోయాను అని యమునా తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: