పెరిగిన ప్రభాస్ సినిమా బడ్జెట్.. మొన్న రూ.300 కోట్లు.. కానీ ఇప్పుడు?

praveen
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఈ పేరు వినిపిస్తే చాలు ప్రస్తుతం సినీ ప్రేక్షకులందరికీ కూడా భారీ బడ్జెట్ సినిమాలే కనిపిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ప్రభాస్ ఏదైనా సినిమాలో నటిస్తూ ఉన్నాడు అంటే చాలు ఆ సినిమాకు వందల కోట్ల బడ్జెట్ పెడుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. అయితే ఈ స్టార్ హీరోకి ఇండియా సినిమా ఇండస్ట్రీలో ఆ రేంజ్ లో మార్కెట్ ఉంది. కాబట్టి ఇంకా ఎక్కువ బడ్జెట్ పెట్టేందుకు నిర్మతలు ఎక్కడ వెనకడుగు వేయడం లేదు. ఇక రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ వందల కోట్లు కాదు ఏకంగా వేలకోట్ల మార్కుని ఎంతో అలవోకగా అందుకుంటూ ఉండటం చూస్తూ ఉన్నాం.

 అయితే అటు ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆ సినిమాలు పెద్దగా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభావం చూపించలేకపోయాయ్. అయినప్పటికీ వసూళ్ల విషయంలో మాత్రం తగ్గేదేలే అంటూ అదరగొట్టేసాయి అని చెప్పాలి. కానీ ఇలా వరుస ప్లాపుల తర్వాత మొన్నటికి మొన్న ఒక సాలిడ్ హిట్టు కొట్టాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మళ్లీ ప్రభాస్ ట్రాక్ లోకి వచ్చేసాడు. ఇక ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకేక్కిన కల్కి సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది.

 1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి నిర్మాతలకు లాభాల పంట పండించింది అని చెప్పాలి.దీంతో ప్రభాస్ మార్కెట్ మరింత పెరిగిపోయింది. డార్లింగ్ తర్వాత సినిమాల నిర్మాతలు కూడా బడ్జెట్ మరింత పెంచడానికి రెడీ అయిపోతున్నారు. కాగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ఒక మూవీ చేయాల్సి ఉంది. స్పిరిట్ అనే టైటిల్ ని ఈ సినిమాకు ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమా కోసం మొదట 300 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ బడ్జెట్ అమాంతం పెరిగిందట. ఏకంగా 500 కోట్లతో ఈ సినిమాను నిర్మించాలని అనుకుంటున్నారట. ఇది మాత్రమే కాదు సలార్ 2, రాజా సాబ్, ప్రభాస్ -  హను కాంబో మూవీ నిర్మాతలు కూడా ఇలా ప్రభాస్ సినిమాల విషయంలో బడ్జెట్ గురించి ఆలోచించకుండా ఎక్కువ పెట్టేందుకు కూడా రెడీ అవుతున్నారు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: