దేవర అంటే దేవుడు.. మూవీపై మరింత హైట్ పెంచుతున్న ఎన్టీఆర్..!

lakhmi saranya
జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీ షూటింగ్లో ఫుల్ బిజీ అయిపోయారు. ఎన్టీఆర్ కొత్తగా రాబోతున్న మూవీ 'దేవర'. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా థియేటర్ లోకి రిలీజ్ కాబోతోంది. మ్యాన్ ఆఫ్ మాసెన్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'దేవర'. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
 నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ పథకాల పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ. కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై భారీ అంచనాలు పెంచగా.. హై ఎక్స్ పెక్టేషన్స్ మధ్య 'దేవర' సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది. ఇక రిలీజ్ సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్ లో జోరు పెంచుతూ... వరుస ఇంటర్వ్యూలలో పాల్గొని సందడి చేస్తున్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు...
సినిమా గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. "దేవర " రిలీజ్ దగ్గర పడటంతో టెన్షన్ గా ఉంది. అయితే... ఈ సినిమా రిజల్ట్ విషయంలో మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. టీం అంతా ఈ మూవీ కోసం ఎంతో కష్టపడింది. దేవర అంటే దేవుడు అనే అర్థం. అందుకే అన్ని భాషల ప్రేక్షకులకు నచ్చాలనే ఉద్దేశంతో ఈ టైటిల్ను ఫిక్స్ చేసాము. కిరణ్ జోహార్ సూచనలతో జాన్వి కపూర్ ను ఈ సినిమాలో తీసుకున్నాము. ఆమె యాక్టింగ్ తో మమ్మల్ని షాకుకు గురి చేసింది' అంటూ చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. ప్రజెంట్ ఎన్టీఆర్ కామెంట్స్ నోటింట వైరల్ అవుతున్నాయి. ఈ వార్త నెట్ ఉంటే వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: