రాజమౌళి సినిమా అంటేనే భారీ బడ్జెట్… ఎంత ఖర్చు చేస్తారో అంతకు రెండింతలు రాబడతారు… అందుకే నిర్మాతలు కూడా రాజమౌళి ఎంత అంటే… అంత బడ్జెట్‌కు ఓకే చేసేస్తుంటారు. బాహుబలి, బాహుబలి-2, ట్రిపుల్ ఆర్.. ఇవన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే… కలెక్షన్ల సునామీ సృష్టించిన సినిమాలే… అందుకే రాజమౌళి మూవీస్ బడ్జెట్‌పై అందరిలోనూ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి… ఇక ప్రిన్స్ మహేశ్‌బాబుతో రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం అంచనాలు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయి… గతంలో వెయ్యి కోట్లు అనుకున్న సినిమా.. బడ్జెట్ ఇప్పుడు మరింత రెట్టింపు అయ్యిందట.ఎస్ఎస్ రాజమౌళి.తీసింది 12 సినిమాలు.. అయినా ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా తెలుసు. దానికి కారణం బహుబలి సిరిసులతో ఇండియా వైడ్ గా గుర్తింపు లభిస్తే.. ఆర్ఆర్ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ గుర్తింపు కొట్టేశాడు. రాజమౌళి సినిమాలు అంటే.. కేవలం కలెక్షన్లు మాత్రమే కాదు.. అవార్డులు కూడా వస్తాయని ఇండియాకు ఆస్కార్ అవార్డు తీసుకువచ్చి నిరూపించాడు. ఇక ఆయన నెక్ట్స్ మూవీ మహేశ్ బాబుతో అనౌన్స్ చేశారు. ఇక అప్పటి నుంచి ఏవో ఒక రూమర్స్ వస్తునే ఉన్నాయి. తాజాగా మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇదిలావుండగా ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమాలో చాలామంది పాన్ ఇండియా ఆర్టిస్టులు నటిస్తున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక దానికి తోడుగా ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ కోసం రజనీకాంత్ ని సంప్రదించినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో రజనీకాంత్ తో క్యారెక్టర్ కనక చేయించినట్లయితే సినిమా మీద భారీ బజ్ కూడా క్రియేట్ అవుతుంది.రాజమౌళి సినిమాలు అంటే ఆటోమేటిగ్గా ప్రేక్షకుల్లో భారీ అంచనాలైతే ఉంటాయి. ఇక దానికి అనుగుణంగానే ఈ సినిమాలో రజనీకాంత్ నటిస్తే తమిళంలో కూడా భారీ హిట్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక పాన్ వరల్డ్ సినిమాగా వస్తుంది. ఇక ఈ సినిమాతో రజనీకాంత్ కూడా వరల్డ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తాడు. మరి రాజమౌళి అనుకున్నట్టుగానే ఈ సినిమాలో ఇంకా చాలామంది నాటులు కూడా నటించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.మరి వాళ్ళందరూ ఈ సినిమాలో చేయడం వల్ల సినిమాకు వెళ్లిపోవడమే కాకుండా వాళ్లతో కూడా పాన్ ఇండియా మార్కెట్ అనేది క్రియేట్ అవుతుందనే చెప్పాలి. ఈ సినిమాలో రజనీకాంత్ మహేష్ బాబు తండ్రిగా కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఇక ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కు రాజ్యసభ ఎంపి, రాజమౌళి తండ్రి వి.విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తుండగా.. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం, పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ.. వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్‌గా ఆర్.సి.కమల్ కణ్ణన్, ప్రొడక్షన్ డిజైనర్‌గా మోహన్ బింగి, ఎడిటర్‌గా తమ్మిరాజు, కాస్ట్యూమ్ డిజైనర్ & స్టైలిస్ట్‌గా రమా రాజమౌళి పని చేయనున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇండోనేషియాకు చెందిన హీరోయిన్ చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ ఇందులో హీరోయిన్గా నటించే అవకాశాలున్నాయని సమాచారం.