జానీ మాస్ట‌ర్ విచార‌ణ‌ ర‌హ‌స్య ప్ర‌దేశంలోనే ఎందుకు?

Suma Kallamadi
టాలెంట్ డాన్స్ మాస్టర్ జానీ వివాదం రోజు రోజుకి మలుపులు తిరుగుతోంది. జానీ తన తోటి లేడి డాన్సర్ విషయంలో లైంగికంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. దాదాపు పది సంవత్సరాల వీరి సహచర్యం ఇప్పుడు బీటలు వారింది. సదరు లేడి డాన్సర్, నాకు సినిమా అవకాశాలు ఇప్పిస్తాను... అంటూనే పలుమార్లు నాపై లైంగిక దాడి చేశాడని, పోలీసు స్టేషన్ లో కేసు పెట్టగా... ప్రస్తుతం జానీ మాస్టర్ ని పోలీసులు పరారీలో ఉన్న సరే వెతికి పట్టుకొని అరెస్టు చేయడం జరిగింది. ఈ ఘటన తర్వాతే ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి.
విషయం ఏమిటంటే, అరెస్టు చేసిన తర్వాత పోలీసులు జానీ మాస్టర్ ని పోలీసు స్టేషన్ కి తీసుకెళ్లకుండా, ఓ ప్రైవేటు హౌస్ లో విచారణ చేయడం రాజకీయంగా పెను దుమారాన్నే సృష్టిస్తుంది. ఇండస్ట్రీలో కొంతమంది ప్రముఖులు జానీ మాస్టర్ ని కాపు కాస్తున్నారని ఓ వర్గం వారు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు మీడియా కూడా ఇదే విషయాన్ని భూతద్దంలో పెట్టి మరి పదేపదే చూపిస్తోంది. దాంతో జానీ మాస్టర్ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు.
ఇకపోతే తాజాగా జానీ మాస్టర్ సతీమణి ఓ మీడియా వేదికగా మాట్లాడుతూ... జానీ మాస్టర్ అలాంటివాడు కాదని, చాలా మంచివాడని మొగుడుని వెనకేసుకుంటూ వచ్చింది. దాంతో సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్స్ గుప్పుమంటున్నాయి. ఇక ఏదేమైనాప్పటికీ పోలీసులు జానీ మాస్టర్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లకుండా ఓ ప్రైవేటు బంగ్లాలో పెట్టి విచారించడం... చాలా విచారకరం అనే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక పోతే జానీ మాస్టర్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు, బ్లాక్ బస్టర్ కొరియోగ్రఫీ అందించడం జరిగింది. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ నేషనల్ అవార్డు అందుకోవడం కూడా తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఈ అవార్డు విషయమై కూడా వివాదం చెలరేగుతుంది. కొంతమంది మహిళా మణులు ఈ అవార్డుని జానీ మాస్టర్ నుండి తక్షణమే లాక్కోవాలని డిమాండ్ చేస్తున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: