సైలెంట్గా.. ప్రభాస్, హను మూవీ షూటింగ్.. ఎందుకు ఇంత సీక్రెట్..!?

frame సైలెంట్గా.. ప్రభాస్, హను మూవీ షూటింగ్.. ఎందుకు ఇంత సీక్రెట్..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ ‘ది రాజా సాబ్’ను శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత తన నెక్స్ట్ మూవీని దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో చేయనున్నాడు. ‘ఫౌజీ’ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇమాన్విని ఇప్పటికే పరిచయం చేశారు మేకర్స్. అయితే, తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంటుందని, ఆమె పాత్ర కూడా చాలా కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది. కాగా రెండో హీరోయిన్ ఎంపిక కూడా జరిగిపోయిందని, సరైన సందర్భం చూసి

 ఆమెను మేకర్స్ రివీల్ చేస్తారనే టాక్ జోరుగా వినిపిస్తోంది.  ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయినట్లు సమాచారం. మధురైలో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట. ఇకపోతే ప్రభాస్ మాత్రం సెట్ లో లేడు అని, ఆయన రాజాసాబ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు అని సమాచారం. అక్కడ షెడ్యూల్ పూర్తయిన తర్వాతే హను సినిమా సెట్ లోకి అడుగు పెడతారట. ప్రస్తుతం మధురై షెడ్యూల్లో ప్రభాస్ పై తెరకెక్కించే సన్నివేశాలు ఏవి లేవు కాబట్టి ఒక వారం రోజులపాటు మదురై లోనే చిత్ర బృందం ఉంటుందని సమాచారం. ఇకపోతే 1945 సంవత్సర కాల నేపథ్యంలో సాగే కథ అని, ఈ చిత్రానికి ఫౌజీ అనే

 టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం . ఇక త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా చిత్ర బృందం ప్రభాస్ పై ఒక ఫోటోషూట్ నిర్వహించగా చిన్న గ్లింప్స్ కూడా డిజైన్ చేసి, దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.. మరోవైపు డార్లింగ్  సెలెక్టివ్ గా కథలు ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు. అందులో భాగంగానే సలార్ 2, కల్కి 2, స్పిరిట్, రాజా సాబ్  చేస్తున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: