హైదరాబాద్ కు జానీ మాస్టర్.. విచారణ అంత అక్కడే..!?

frame హైదరాబాద్ కు జానీ మాస్టర్.. విచారణ అంత అక్కడే..!?

Anilkumar
 కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌  
 ని గోవాలో పోలీసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కి తరలిస్తున్నారు. మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తో పాటు ఆమె భార్యపై కూడా కేస్ పెట్టింది. జానీ మాస్టర్ భార్య సైతం తనపై దాడి చేసిందని ఆ బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఇటీవల జానీ మాస్టర్ భార్య అయేషా నార్సింగి పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. ఇటీవల జానీ మాస్టర్ కి వచ్చిన ఫేక్ కాల్ పై సమాచారం తెలుసుకోవడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది  కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌   భార్య. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ కేసుకు సంబంధించి ఆమెని మాట్లాడించడానికి మీడియా ప్రయత్నం చేసింది.  మరోవైపుగురువారం గోవా కోర్టు అనుమతితో జానీ మాస్టర్‌ను

 హైదరాబాద్‌కు పోలీసులు తరలించారు.  కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌   ను రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నారు. నేడు సైబరాబాద్ పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం జానీ నార్సింగి పోలీసుల అదుపులో ఉన్నాడు.  నమోదైనప్పటి నుంచి జానీ మాస్టర్‌ పరారీలో ఉన్నాడు. నెల్లూరు, నార్త్ ఇండియా స్టేట్స్‌కు వెళ్లాడని వార్తలు వచ్చాయి. కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌   ని పట్టుకునేందుకు సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు నాలుగు బృందాలుగా రంగంలోకి దిగారు. 4-5 రోజులుగా పరారీలో ఉన్న అతడిని గోవాలోని ఓ లాడ్జిలో అదుపులోకి తీసుకున్నారు. స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచి.. ట్రాన్సిట్‌ వారెంట్‌పై హైదరాబాద్‌కు

 తరలించారు.   కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ పై ఆయన అసిస్టెంట్‌ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. మైనర్ గా ఉన్నప్పటి నుంచి జానీ మాస్టర్‌ తనను లైంగికంగా వేధించాడని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. బాధితురాలు జానీ మాస్టర్‌ భార్య సుమలత అలియాస్ ఆయేషా పైనా ఆరోపణలు చేసిన నేపథ్యంలో పోలీసులు ఆమెను ఎంక్వైరీ చేశారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: